నిజామాబాద్

ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 20: ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా, ప్రజలు వారిని ఎన్నికల్లో తిరస్కరిస్తూ డిపాజిట్లను గల్లంతు చేయడం ఖాయమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో ఇదివరకటి పాలకులు పెద్దఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేశారని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పథకమే ఇందుకు నిదర్శనమని ఆయన ఆరోపించారు. కోటగిరి మండలం దేవునిగుట్టతండాలో 1.56 కోట్ల రూపాయలను వెచ్చిస్తూ 30 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు, కొత్తపల్లిలో 1.26 కోట్లతో నిర్మించనున్న 25 ఇళ్లకు మంత్రి పోచారం గురువారం శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభల్లో ఆయన మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలవుతుండగా, 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, 15 ఏళ్లు పాలించిన తెలుగుదేశం పార్టీలు తెలంగాణ ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకోలేకపోయాయని విమర్శించారు. తెరాస అధికారంలోకి వచ్చిన మీదట పేద కుటుంబాల వారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 5.04 లక్షల రూపాయలను వెచ్చిస్తున్నారని, వౌలిక సదుపాయాల కల్పన కోసం సీ.సీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, కుళాయి కనెక్షన్ వంటి వాటికి అదనంగా మరో 1.25 లక్షల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. దాదాపు ఒక్కో ఇంటికి 7లక్షల రూపాయల వరకు నిధులను వెచ్చిస్తున్నామని, ఇవి పూర్తిగా వంద శాతం రాయితీని వర్తింపజేస్తూ, లబ్ధిదారులపై నయాపైసా భారం వేయకుండా పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే అన్ని వసతులతో పక్కా ఇళ్లను నిర్మించి ఇస్తున్నామని అన్నారు. గత పాలకులు బినామీ పేర్లపై ఇళ్లను మంజూరు చేయించుకుని పెద్దఎత్తున నిధులను దిగమింగారని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పథకంలో లెక్కకుమిక్కిలి అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. ప్రస్తుతం తెరాస పార్టీ అన్ని వర్గాల వారి సంక్షేమాన్ని కాంక్షిస్తూ జనరంజక పాలనను సాగిస్తుంటే, ఓర్వలేకపోతున్న ప్రతిపక్షాలు అర్ధంపర్ధం లేని విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చి దోపిడీ ధోరణిని కొనసాగించాలని అర్రలు చాస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడమే కాకుండా, ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. దేశంలోనే మరెక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజలో నిలుస్తోందన్నారు. రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వ్యవసాయానికి ఉచితంగా 24గంటల విద్యుత్‌ను అందిస్తున్నామని గుర్తు చేశారు. రైతుబంధు పథకం కింద ఎకరానికి సాలీనా 8వేల రూపాయల ముందస్తు పెట్టుబడిని అందిస్తున్నామని, సాగునీటి కష్టాలను దూరం చేసేందుకు లక్షన్నర కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలిపారు. చిన్న, సన్నకారు రైతులు ప్రీమియంను చెల్లించే ఆర్థిక స్థోమత కలిగి ఉండరనే ఉద్దేశ్యంతో ప్రభుత్వమే ప్రతి రైతు తరఫున బీమా ప్రీమియంను చెల్లిస్తూ వారి కుటుంబాల్లో భరోసాను నింపుతోందని మంత్రి పోచారం పే ర్కొన్నారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు పంట చేతికందే వరకు సాగునీరు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. గడిచిన అరవై ఏళ్లలో జరగని అభివృద్ధిని కేవలం నాలుగేళ్ల మూడు మాసాల్లో చేసి చూపించామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, అధికారులు పాల్గొన్నారు.