నిజామాబాద్

ఇందూరులో శోభాయమానంగా వినాయక నిమజ్జనోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 23: నిజామాబాద్‌లో వినాయక నిమజ్జనోత్సవాలను ఆదివారం శోభాయమానంగా జరుపుకున్నారు. పదకొండు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అందంగా అలంకరించిన వినాయక విగ్రహాలను లారీలు, ట్రాక్టర్లు, జీపులు, ట్రాలీ ఆటోలలో ఊరేగించారు. శోభాయాత్ర సందర్భంగా నిజామాబాద్ నగరమంతా సందడి నెలకొంది. ఎప్పటిలాగే ఈసారి కూడా మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో నగరంలోని దుబ్బ ప్రాంతం నుండి వినాయక విగ్రహాల ఊరేగింపు ప్రారంభమయ్యింది. సార్వజనీక్ గణేష్ మండలి ప్రతినిధి బంటు గణేష్ పచ్చజెండా ఊపి రథయాత్రను ప్రారంభించారు. రాజ్యసభ సభ్యుడు డీ.శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, నగర మేయర్ ఆకుల సుజాత, కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు, పోలీస్ కమిషనర్ కార్తికేయ, అర్బన్ తాజామాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, బీజేపీ నాయకులు యెండల లక్ష్మినారాయణ, ధన్‌పాల్ సూర్యనారాయణ, డీ.అరవింద్, కాంగ్రెస్ నాయకులు మహేష్‌కుమార్ గౌడ్, అర్కల నర్సారెడ్డి, తాహెర్‌బిన్ హందాన్ తదితరులు వినాయక శోభాయాత్ర ప్రారంభోత్సవ సంబరంలో పాల్గొన్నారు. అందంగా అలంకరించిన 25జతల ఎడ్లతో రథయాత్ర ముందుకు సాగుతుండగా, దాని వెనుకే ఇతర వినాయక విగ్రహాలు వివిధ వాహనాల్లో ఊరేగింపుగా తరలివెళ్లాయి. విద్యుద్దీపాల కాంతుల నడుమ అందంగా అలంకరించిన వినాయకమూర్తులు శోభాయమానంగా నిమజ్జనానికి తరలివెళ్లాయి. శోభాయాత్ర సందర్భంగా ‘జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’...‘గణపతి బొప్పా మోరియా’ అంటూ పెద్దఎత్తున చేసిన నినాదాలతో నగర వీధులన్నీ మార్మోగాయి. చిన్నా, పెద్దా తారతమ్యం లేకుండా వేలాది సంఖ్యలో భక్తులు నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. నగరమంతటా ఎటుచూసినా భక్త జన సందోహమే కనిపించింది. శోభాయాత్ర ప్రారంభం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సీ.పీ కార్తికేయ, అదనపు డీసీపీ రాంరెడ్డిల నేతృత్వంలో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. శోభాయాత్ర కొనసాగే ప్రధాన వీధుల్లో అడుగడుగునా పోలీసులు పహారా కాశారు. నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా వాహనాల రాకపోకలను ఇతర ప్రాంతాల మీదుగా దారి మళ్లించారు. దుబ్బ నుండి ప్రారంభమైన శోభాయాత్ర గుర్బాబాది రోడ్, పాతగంజ్, కిషన్‌గంజ్, గాంధీచౌక్, నెహ్రూపార్క్, పవన్ థియేటర్ చౌరస్తా, బర్కత్‌పురా, గాజుల్‌పేట్, పెద్దబజార్, గోల్‌హన్మాన్, పాటిగల్లి, ఫులాంగ్ చౌరస్తాల మీదుగా వినాయక్‌నగర్‌కు తరలివెళ్లాయి. తమ ఇళ్ల వద్ద మహిళలు వినాయక విగ్రహాలకు మంగళ హారతులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా వినాయక ఉత్సవ నిర్వాహకులు ప్రసాద వితరణ చేశారు. యువకులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా నిమజ్జనోత్సవంలో పాల్గొన్నారు. ఊరేగింపులో పాల్గొంటున్న తమతమ వినాయక మంటపాల ముందు భక్తిగీతాలు పెట్టుకుని, వాటికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ నినాదాలతో ముందుకు సాగారు. మేళ తాళాలు, భజన గీతాలు, కోలాట ప్రదర్శనలతో ప్రజలు భక్తి పారవశ్యంతో గణనాథుడిని స్తుతిస్తూ తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. ఒకరిపై ఒకరు గులాల్‌లు చల్లుకుంటూ ఆనందోత్సాహాల నడుమ నిమజ్జనోత్సవ వేడుకలు జరుపుకున్నారు. శోభాయాత్ర గాంధీచౌక్ ప్రాంతానికి చేరుకునే సరికి సాయంత్రం ఐదు గంటలయ్యింది. అక్కడి నుండి పవన్‌థియేటర్ చౌరస్తా, గోల్‌హన్మాన్, ఖిల్లారోడ్, ఆజం రోడ్, రాజరాజేంద్ర థియేటర్ చౌరస్తా, వర్ని రోడ్, ఫులాంగ్ చౌరస్తాల మీదుగా వినాయక్‌నగర్‌లోని వినాయక బావికి తరలివెళ్లగా, భారీ విగ్రహాలను బాసరలో నిమజ్జనం చేసేందుకు సారంగపూర్, జాన్కంపేట్, నవీపేటల మీదుగా తరలించారు. మరికొన్ని భారీ విగ్రహాలను బోర్గాం(పీ) గ్రామ శివారులో గల చెరువులో నిమజ్జనం చేశారు. ఇందూర్ సంస్కార భారతి, ఆర్యసమాజ్, శివసేన తదితర సంస్థల వారు ప్రధాన కూడళ్ల వద్ద వేదికలను ఏర్పాటు చేసుకుని శోభాయాత్రలో తరలివచ్చే వినాయక విగ్రహాలకు, మంటపాల నిర్వాహకులకు స్వాగతం పలుకుతూ మెమొంటోలతో సత్కరించారు. నిమజ్జనోత్సవం సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పక్షాల నాయకులు భక్తులకు పండ్లు, మినరల్ వాటర్ ప్యాకెట్లను అందజేశారు. నెహ్రూపార్క్, పవన్ థియేటర్ సమీపంలో మైనార్టీ సోదరులు పెద్దఎత్తున పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి మతసామరస్యాన్ని చాటారు. కాగా, నిమజ్జనోత్సవాలను సవాల్‌గా తీసుకుని జిల్లా పోలీస్ యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. పెద్ద సంఖ్యలో పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. స్పెషల్ పార్టీ పోలీసులు విస్తృతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించి ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేరవేశారు. శోభాయాత్ర ప్రారంభం మొదలుకుని నిమజ్జనోత్సవం వరకు పోలీస్ శాఖ వీడియో కెమెరాలలో ప్రదర్శనను చిత్రీకరించింది. పలుచోట్ల క్లోజ్‌డ్ సర్క్యూట్ కెమెరాలను ఏర్పాటు చేశారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్ వర్గాలకు ఇన్‌ఫార్రెడ్ బైనాక్యులర్స్ కేటాయించి శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో ఎతె్తైన భవనాల పై నుండి పరిస్థితులను సమీక్షించారు. అంతేకాకుండా ప్రార్థనాలయాల వద్ద పికెటింగ్‌లను ఏర్పాటు చేసి శాంతియుతంగా ఉత్సవాలు జరిగేలా కృషి చేశారు. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉత్సవాలు ప్రశాంతంగా ముగియడంతో జిల్లా యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది.

నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత
నిజాంసాగర్, సెప్టెంబర్ 23: నిజాంసాగర్ ప్రాజెక్ట్ జలాశయం ద్వారా ఆయకట్టు రైతులకు, నీటి విడుదల ఆదివారం మధ్యాహ్నం నిలిపి వేయడం జరగిందని ప్రాజెక్ట్ డీఈఈ దత్తాత్రి తెలిపారు. నిజాంసాగర్‌ప్రాజెక్ట్ ద్వారా ఖరీప్‌లో ఆయకట్టు కింద లక్షా 20వేల ఎకరాల్లో వేసిన పంటలను రక్షించేందుకోసం, ఈనెల 14 నుంచి 23వ తేదివరకు నీటి విడుదల కొనసాగిందన్నారు. ఇప్పటి వరకు 0.8 టీఎంసీల నీటిని ఆయకట్టు రైతుల పంటపొలాలకు సాగు నీరు అందించడం జరిగిందన్నారు.ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు కాగా, 1380.58 అడుగుల నీరు నిల్వఉందన్నారు. 17.802 టీఎంసీలకు గాను 1.41 టీఎంసీల నీరు నిల్వఉందని తెలిపారు. తిరిగి నీటి విడుదలను జిల్లా నీటిపారుదల శాఖాధికారుల ఆదేశాల మేరకు విడుదల చేయడం జరుగుతోందని డీఈఈ తెలిపారు.