నిజామాబాద్

త్వరలో 21వ ప్యాకేజీ పనులకు మోక్షం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, సెప్టెంబర్ 24: నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పంట భూములకు సాగునీరు అందించే ప్యాకేజీ 21 పనులను త్వరగా ప్రారంభించేలా చూడాలని బాల్కొండ తాజామాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను కోరారు. దీనికి సంబంధించి జలసౌధలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో కరవుతో అల్లాడే గ్రామాలకు సాగునీటిని అందించేందుకే 21వ ప్యాకేజీ పనులను చేపట్టడం జరుగుతుందని అన్నారు. త్వరగా పనులు ప్రారంభించేలా చూస్తే ఆపద్ధర్మ మంత్రితో శంకుస్థాపన కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుంటామని ఆయన తెలిపారు. టెండర్లు పూర్తి డిజైన్‌తో పూర్తయ్యాయని అధికారులు తెలుపగా, దానికి సంబంధించిన ప్యాకేజీ మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. నియోజకవర్గంలోని వేల్పూర్ మండలంలో 28,066 ఎకరాలు, కమ్మర్‌పల్లిలో 16,675 ఎకరాలు, మోర్తాడ్‌లో 16,85 0ఎకరాలకు, వేల్పూర్‌లో అదనంగా 9100 ఎకరాలకు మొత్తం 71 వేల ఎకరాల పంట భూములకు సాగునీరు అందించేందుకు ప్యాకేజీ 21 ఉపయోగపడుతుందని గోదావరి బేసిన్ కమిషనర్ మధుసుదన్‌రావు, ప్రశాంత్‌రెడ్డికి సూచించారు. గతంలో కాల్వల ద్వారా పనులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరీ చేసినప్పటికీ, దానివల్ల రైతులు పంట భూములను ఎక్కువగా కోల్పోయే అవకాశం ఉన్నందున, కాల్వల స్థానంలో పైప్‌లైన్ ద్వారా పనులు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి మూడు ఎకరాలకు ఒక ఔట్‌లైట్‌ను ఏర్పాటు చేసి ప్రతి పంట భూమికి సాగునీటిని అందిస్తామని తెలిపారు. మొత్తం ప్యాకేజీ పనులకు 2623 కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని, నిధులు అందుబాటలో ఉన్నందున త్వరలో పనులు ప్రారంభిస్తే రైతులకు న్యాయం జరుగుతుందని ప్రశాంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావుతో పాటు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.