నిజామాబాద్

‘రైతుబంధు’ లబ్ధి కొందరికేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 25: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు పథకం ద్వారా పూర్తిస్థాయిలో అర్హులైన రైతులందరూ లబ్ధి పొందలేకపోతున్నారని జిల్లా పరిషత్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జడ్పీ చైర్మెన్ దఫేదార్ రాజు అధ్యక్షతన జరిగిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎం.పీ బీబీ.పాటిల్, శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ వీజీ.గౌడ్‌తో పాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఎం.రామ్మోహన్‌రావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీలు తానాజీరావు, పుప్పాల శోభ తదితరులు మాట్లాడుతూ, ప్రభుత్వపరంగా ఇదివరకు నిరుపేద కుటుంబాల వారికి అందించిన అసైన్‌మెంట్ భూములకు సంబంధించి అనేక మందికి కొత్త పట్టాపాస్ బుక్కులు రాలేదని, దీనివల్ల వారు రైతుబంధు పథకం కింద ముందస్తు పెట్టుబడిని పొందలేకపోతున్నారని, బీమా సౌకర్యానికి దూరంగా ఉండిపోవాల్సి వస్తోందన్నారు. గత అనేక సంవత్సరాల నుండి వారు పంటలను సాగు చేస్తున్నప్పటికీ వారికి నూతన పట్టాపాస్ పుస్తకాలు అందించడం లేదని అసంతృప్తి వెళ్లగక్కారు. రెవెన్యూ అధికారులు ఇదివరకే పట్టాలు పంపిణీ చేయగా, అటవీ శాఖ అధికారులు మాత్రం ఫారెస్టు భూములంటూ పంటల సాగుకు అడ్డు చెబుతున్నారని అన్నారు. ఈ కారణంగానే రైతులకు కొత్త పాస్‌బుక్కులు మంజూరు కాక, వారు రైతుబంధు లబ్ధికి దూరంగా ఉండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య దూరం కావాలంటే రెవెన్యూ, ఫారెస్టు అధికారులతో జాయింట్ సర్వే నిర్వహించాలని గత చాలాకాలంగా కోరుతున్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదని అధికారులను నిలదీశారు. దీనిపై కలెక్టర్లు ఎంఆర్‌ఎం.రావు, సత్యనారాయణలు మాట్లాడుతూ, ఇబ్బడిముబ్బడిగా సర్వేయర్ల ఖాళీలు ఉండడం వల్ల సర్వేలు జరిపించేందుకు ఒకింత ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. అయినప్పటికీ సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించి అర్హులైన వారికి లబ్ధి చేకూర్చేందుకు చొరవ చూపుతున్నామన్నారు. న్యాయపరమైన వివాదాలు లేకుండా సర్వే నెంబర్లు సక్రమంగా ఉన్న భూములకు సంబంధించి రైతులందరికీ కొత్త పాస్‌బుక్కులు పంపిణీ చేస్తామని, బ్రతుకుదెరువు కోసం విదేశాల్లో ఉంటున్న రైతులకు కూడా వారి నుండి డిక్లరేషన్‌ను తీసుకుని కుటుంబ సభ్యులకు రైతుబంధు చెక్కులు అందించనున్నామని, ఈ మేరకు ప్రభుత్వం నుండి సంకేతాలు అందినప్పటికీ స్పష్టమైన మార్గదర్శకాలు వెల్లడి కావాల్సి ఉందని కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు తెలిపారు. ఇదిలాఉండగా, గాంధారి నుండి నిజామాబాద్‌కు వచ్చేందుకు దగ్గరి దారిగా ఉన్న చద్మల్ - మంచిప్ప రోడ్డు నిర్మాణం పనులు ఏళ్ల తరబడి పూర్తి కావడం లేదని నిజామాబాద్, గాంధారి జడ్పీటీసీలు పుప్పాల శోభ, తానాజీరావులు ఆక్షేపించారు. ఈ విషయమై ఆర్ అండ్ బీ అధికారులను అడిగితే, అటవీ శాఖ అభ్యంతరాలు తెలుపుతోందని, ఏకంగా కేసులు నమోదు చేసిందని సమాధానం ఇస్తూ దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. దీనిపై ఎం.పీ బీబీ.పాటిల్ స్పందిస్తూ, తనకు పూర్తి వివరాలతో నివేదికను సమర్పిస్తే ఢిల్లీలో సంబంధిత శాఖ కేంద్ర మంత్రులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు. కాగా, ఎరువులను బ్లాక్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని సదాశివనగర్ జడ్పీటీసీ సమావేశం దృష్టికి తేగా, ఆధారాలతో ఫిర్యాదు చేస్తే సదరు డీలర్లపై చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు వివరణ ఇచ్చారు. ఖలీల్‌వాడి మైదానంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ మడిగెలకు మొదటి నుండి అద్దె కేవలం నెలకు 3వేల రూపాయలు వసూలు చేస్తున్నారని, నిజానికి అక్కడ కనీసం 30వేల వరకు అద్దె ఉందని జడ్పీటీసీలు పేర్కొన్నారు. అద్దెను పెంచాలని, లేనిపక్షంలో కొత్తగా టెండర్లు పిలిచి మడిగెలు కేటాయించాలని పదేపదే కోరుతున్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని జడ్పీటీసీ తానాజీ అసంతృప్తి వెళ్లగక్కారు. అద్దె రూపంలో సమకూరే ఆదాయంతో జిల్లా క్రీడా అథారిటీకి నిధులు సమకూరి జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి వెచ్చించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ విషయమై కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు స్పందిస్తూ, ఈ అంశంపై తగిన కసరత్తులు కొనసాగిస్తున్నామని, త్వరలోనే సముచిత నిర్ణయాన్ని అమలు చేస్తామని అన్నారు. కాగా, విద్యాశాఖపై చర్చ సందర్భంగా పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఉపాధ్యాయుల ఖాళీలు కొనసాగుతున్నాయని, విద్యార్థులు లేనిచోట ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయులు ఉన్నారని జడ్పీటీసీలు, ఎంపీపీలు పేర్కొన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని విద్యాశాఖ అధికారులను కోరారు. సమావేశంలో నిజామాబాద్ జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈఓ గోవింద్, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఉమ్మడి జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే..
అధికారంలో వచ్చిన వెంటనే రైతులకు రెండులక్షల రుణ మాఫీ * శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ
బీబీపేట్, సెప్టెంబర్ 25: తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఆ ఘనత సోనియాగాంధీకే దక్కుతుందని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. మంగళవారం బీబీపేట్ మండల కేంద్రంలోని ఎస్ ఆర్ ఎం గార్డెన్‌లో నిర్వహించిన మండల కాంగ్రెస్ విసృత్త స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌యేనన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వస్తే నిరుపేదలకు డబూల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పి, నేటికి ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ హాయంలో ఎంతో మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించామన్నారు. కేసీఆర్ మాత్రం మూడు కోట్ల వ్యయంతో సొంత ఇల్లు కట్టుకున్నారని, కొండగట్టులో జరిగిన బస్సు ప్రమాదంలో 62 మంది ప్రయాణికులు చనిపోతే ముఖ్యమంత్రి అయి ఉండి కనీసం బాధితులని పరామార్శించడానికి కూడా వెళ్లక పోవడం దారుణం అని అన్నారు. తెలంగాణ సాధన కోసం ఎంతో మంది ప్రాణాత్యాగాలుచేసిన వారి కోసం ఒక స్థూపం ఏర్పాటు చేయని ప్రభుత్వం, హరికృష్ణ చనిపోతే అక్కడికి వెళ్ళి వారికి సానుభూతి తెలిపి, వెంటనే మూడు గుంటల భూమిని స్థూపం కోసం కేటాయించారని విమర్శించారు. తెలంగాణ కోసం హరికృష్ణ ఏమి చేశారని ప్రశ్నించారు. లక్ష రూపాయాల రైతు రుణామాఫీ చేస్తామని, నాలుగు సంవత్సరాలుగా విడుతల వారిగా ఇచ్చారు కానీ, ఎ ఒక్కరికి బ్యాంక్ నుంచి రుణం క్లియార్ అయిందా అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒకే సారి రైతులకు రెండు లక్షల రుణామాఫీ చేస్తామన్నారు. ఇప్పుడు ఇస్తన్న ఆసరా ఫించన్‌లు వేయి నుంచి రెండు వేలకు పెంచుతామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలాగ 65 సంవత్సరాలు కాకుండా 58 సంవత్సరాల పింఛన్ వయస్సు ఆర్హతగా గుర్తిస్తామన్నారు. కుటుంబంలో ఒకరికి కాకుండా అర్హులైన వారందరికి పింఛన్‌లు ఇస్తామన్నారు. వికలాంగులకు 1500ల నుంచి 3000ల వరకు పెంచుతామన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల నిర్మాణాలకు 5 లక్షల రుణ సహాయం, అందిస్తామన్నారు. ఒకే కుటుంబంలో రెండు ఇండ్ల నిర్మాణాలు అవసరం అయితే 12 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ప్రస్తుతం రేషన్ షాపుల ద్వారా బియ్యం మాత్రమే పంపిణీ అవుతుందని, తమ ప్రభుత్వం వస్తే 11 రకాల సరుకులు సరఫరా చేస్తామన్నారు. ఒక కుటుంబానికి సంవత్సరానికి 6 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. టీఆర్ ఎస్‌ప్రభుత్వం డ్వాక్రా మహిళలను చిన్న చూపు చూసిందన్నారు. అభయహస్తం, బంగారు తల్లి పథకాలు తిరిగి అమలుచేస్తామన్నారు. కామారెడ్డితో పాటు చూట్టు ప్రక్కల మండలాల్లో 76 దేవాలయాల అభివృద్ది కోరకు 75 శాతం సహకరించామన్నారు. సమావేశానికి భారీగా తరలివచ్చిన జనం 2 వేలకు పైగా కార్యకర్తలు, రైతులు, బీడీ కార్మికులు హాజరు అయ్యారు. మాచారెడ్డి మండలం నుంచి సుమారు 100కు పైగా బైక్ ర్యాలీతో షబ్బీర్‌కు ఘన స్వాగతం పలికారు. షబ్బీర్ సమక్షంలో ఉప్పర్‌పల్లి, ఇస్సానగర్, మల్కాపూర్, తుజాల్‌పూర్ గ్రామాల నుంచి 500ల మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్, అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంజీ. వేణుగోపాల్‌గౌడ్, బీబీపేట్ ఎంపీటీసీ చందుపట్ల లక్ష్మి, విఠల్, బీబీపేట్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమాగౌడ్, పట్టణాధ్యక్షుడు సుతారి రమేశ్, మండలాధ్యక్షుడు సాయి, శ్రీకాంత్, అర్కెల శ్రీను, కొర్వినర్సింలు, తదితరులు పాల్గొన్నారు.

ఈవీఎంల పనితీరుపై అవగాహన
ఇందూర్, సెప్టెంబర్ 25: నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)ల తనిఖీ ప్రారంభమైందని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఈవీఎంల గోదాంలో వాటి పని తీరుపై ఆయా రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యక్షంగా, ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భారత ప్రభుత్వ సంస్థ బీఈఎల్ తయారు చేసిన ఈ యంత్రాలు కొత్త సాంకేతికతతో తయారైనవని అన్నారు. ప్రతి యంత్రాన్ని ఇక్కడ క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని, ఇవి సున్నితమైనవని, అధిక ఉషోగ్రతను ఈ యంత్రాలు తట్టుకోలేవని కలెక్టర్ వివరించారు. ఏ నెంబర్ గల యంత్రం ఏ గ్రామానికి వెళ్తుందో, ఏ అభ్యర్థికి, ఏ పార్టీ ఏ క్రమ సంఖ్య వస్తుందో కూడా ముందు తెలియదన్నారు. అలాగే ఈవీఎంలకు ఇంటర్నేట్ సౌకర్యం ఉండదని, అందువల్ల ఎవ్వరు కూడా ఇతర ప్రాంతాల నుండి అక్రమాలకు పాల్పడే ఆస్కారమే ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు. అనంతరం ఈవీఎంల పనితీరుపై అక్కడే ఉన్న సాంకేతిక సిబ్బందితో మాక్ పోలింగ్ చేయించి ప్రత్యక్షంగా చూపించి, ప్రజాప్రతినిధుల సందేహాలను నివృత్తి చేశారు. ఈవీఎంల గోదా వద్ద పకడ్బందీ భద్రత ఏర్పాట్లు, బారీకేడ్లు, సిబ్బందిని నియమించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీల్లో డీఆర్‌ఓ అంజయ్య, టీఆర్‌ఎస్ పార్టీ నుండి సూదం రవిచందర్, ఐఎన్‌సీ నుండి జావీద్ అక్రం, గోపికృష్ణ, బీజేపీ నుండి గంగాకిషన్, టీడీపీ నుండి రాజమల్లు, బీఎస్పీ నుండి డాక్టర్ డీఆర్.గైక్వాడ్ తదితరులు పాల్గొన్నారు.