నిజామాబాద్

గోసంగిల సంక్షేమానికి కట్టుబడి ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, అక్టోబర్ 14: ప్రభుత్వం బలహీనవర్గాలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గోసంగి వారికి కూడా అందేలా కృషి చేస్తామని తాజామాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాజేశ్వర్, మాజీ స్పీకర్ కేఆర్.సురేష్‌రెడ్డిలు అన్నారు. మోర్తాడ్ ఆర్ అండ్ బీ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జిల్లా గోసంగి సంఘ సర్వసభ్య సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, బాబాసాహెబ్ అంబేద్కర్ చొరవతో గోసంగిలకు కూడా రిజర్వేషన్లు దక్కాయని అన్నారు. అయితే సంక్షేమ కార్యక్రమాలు తమకు అందడం లేదని గోసంగి నేతలు చెబుతున్న నేపథ్యంలో అధికారం చేపట్టిన వెంటనే సమాజంలోని గోసంగివర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను బడుగు, బలహీనవర్గాల కోసం ప్రవేశపెట్టారని, ఎంతోమందికి లబ్ధి చేకూరిందన్నారు. బ్యాంకులకు సంబంధం లేకుండా రుణాలు ఇప్పించాలని కోరుతున్న నేపథ్యంలో తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేక దృష్టి సారించి గోసంగిల అభివృద్ధికి పాటుపడ్తానని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం పని చేసే సర్కార్ అని, సమాజంలోని ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలను అందించిందన్నారు. నియోజకవర్గంలో గోసంగి భవన నిర్మాణం కోసం తనవంతుగా 5లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే జిల్లా గోసంగి భవనానికి తన కోటా నుండి 25లక్షల రూపాయలను కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, గోసంగిలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు తనవంతుగా రాబోయే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమాజంలోని బడుగు, బలహీనవర్గాలు ఆర్థిక పురోగతి సాధించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమని, ఇదే కేసీఆర్ దృష్టి అని మనమందరం కూడా ఆ దిశలో పయనించాలని ఆయన కోరారు. నియోజకవర్గ గోసంగి సంఘ అధ్యక్షుడు గంధం మహిపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బుచ్చన్న, ప్రముఖ రచయిత గానిశెట్టి రాములు, ఎంపీపీ కల్లెడ చిన్నయ్య, వైస్ ఎంపీపీ పాపాయి పవన్, ఎంపీటీసీలు మురళీ, లక్ష్మి, తాజామాజీ సర్పంచ్ దడివె నవీన్, రాజాపూర్ణానందం, శివలింగు శ్రీనివాస్‌తో పాటు గోసంగి సంఘ జిల్లా కార్యవర్గ సభ్యులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.