నిజామాబాద్

బోధన్ భారమంతా కోడలమ్మ పైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, అక్టోబర్ 14:బోధన్ శాసనసభా నియోజకవర్గంలో నెలకొని ఉన్న పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థి గట్టి పోటీ నిస్తుండటంతో ఈ నియోజకవర్గ భారమంతా ఈ సెగ్మెంట్ కోడలమ్మగా పిలువబడే ఎంపీ కవిత తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా నియోజకవర్గంలో మళ్లీ తెరాస గెలుపొందాల్సిందే అన్న లక్ష్యంతో ఎంపీ ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం గత రెండు నెలలుగా వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్‌తో విభేదించిన నాయకులందరినీ ఏక తాటిపైకి తీసుకొచ్చారు. వారందరినీ మాజీ శాసనసభ్యునితో కలపడంతో నేడు రజాక్‌తో పాటు ఆయన అనుచరులు ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు. పదవులతో సంబంధం లేకుండా పనిచేసే మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బుద్దె రాజేశ్వర్ సైతం ఎంపీ సమావేశం అనంతరం ప్రచారంలో పార్టీ అభ్యర్థి వెన్నంటి ఉంటున్నారు. అన్ని విషయాల్లో ఎంపీ గ్రూపు, ఎమ్మెల్యే గ్రూపు అనేది లేకుండా అందరూ ఒకే గ్రూపు అనే విధంగా పార్టీ క్యాడర్‌ను దారిలో పెట్టారు. గత కొన్ని రోజుల క్రితం అల్లీసాగర్‌లో రహస్య సమావేశం ఏర్పాటు చేసి అన్ని గ్రూపుల నాయకులను అక్కడికి పిలిచి వారితో అభిప్రాయాలు సేకరించారు. నాలుగురన్నరేళ్ల పాటు వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, సాధించిన విజయాలు అడిగి తెలుసుకున్నారు. ఇక నుండి అందరు కలిసి తెరాస అభ్యర్థి విజయం కోసం సమషిగ్టా కృషి చేయాలని సూచించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వారికి తెలియచేశారు. ఆ తర్వాత బోధన్‌లో ఓ బహిరంగ సభ నిర్వహించి ఈ సభకు పార్టీ అభ్యర్థికి మద్దతుగా మంత్రి ఈటెలను రప్పించంలో ప్రధాన పాత్ర పోషించారు. అలాగే బోధన్‌లో జరిగిన వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని విస్తృతంగా పర్యటించారు. ఒక గ్రామంలో మాజీ శాసనసభ్యుడి ప్రసంగం సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల నాయకులు వైరల్ చేయడంతో ఈ వైరల్‌ను కొట్టి పారేసే విధంగా వ్యవహరించాలని మాజీ శాసనసభ్యుడికి సూచించినట్లు తెలిసింది. దాంతో ఆయన కూడా తన స్పీడ్‌ను పెంచి గణేష్ విగ్రహాల వద్ద లడ్డూలను వేలంలో దక్కించుకుంటూ దేవాలయాల వద్ద పూజలు చేస్తూ దర్గాల వద్ద అన్నదానాలు చేస్తూ రెండు వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా ముందుకు సాగుతున్నారు. వారం రోజుల నుండి ఎంపీ స్థానిక కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గానికి సంబంధించి అన్ని విషయాలపై ఎప్పటి కప్పుడు తగిన సమాచారాన్ని సేకరిస్తున్నారు. నాలుగు మండలాలలో కాంగ్రెస్‌కు దీటుగా ప్రచారం చేయాలని పార్టీ నాయకులను ఆదేశిస్తున్నారు. అవసరమైతే బోధన్ పట్టణ కేంద్రంలో క్యాంపు కార్యాలయం కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమేనన్న సంకేతాలు కూడా పంపినట్లు తెలిసింది. అంతేకాకుండా ఏ గ్రామం నుండి ప్రచారాన్ని మొదలు పెడితే విజయం సాధించవచ్చో తెలుసుకుంటే మంచి ముహూర్తంతో ఆ గ్రామం నుండి ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు కూడా ఎంపీ పార్టీ ముఖ్య నాయకులకు తెలియచేసినట్లు సమాచారం. ఇందుకోసం కొందరు నాయకులు సమాలోచనలు జరుపుతున్నారు. నియోజకవర్గం నుండి బరిలో నిలిచిన మాజీ శాసనసభ్యుడు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులకు దీటుగా సమాధానాలు ఇస్తూనే ఘాటైన విమర్శలు కూడా చేస్తున్నారు. అలాగే ఇతర పార్టీల నుండి వలస వచ్చే వారికి స్నేహపూర్వకంగా స్వాగతం పలుకు తున్నారు. పాత, కొత్త మిత్రులందరిని ఇళ్లకు వెళ్లి కలుస్తూ ఈసారి హృదయ పూర్వకంగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్నటి వరకు కొంతమంది నాయకుల తీరు వలన కష్టపడి పనిచేసే కార్యకర్తలంతా ఆయన దగ్గరికి వెళ్లి వాస్తవాలు చెప్పలేక పోయారు. అంతేకాకుండా నాయకులు ఇటువంటి కార్యకర్తలను ఆయనకు దూరం చేసి తమ పబ్బం గడుపుకున్నారని సీనియర్ కార్యకర్తలు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఇటువంటి వాటన్నిటిని సీరియస్‌గా పరిగణించిన ఎంపీ ఈ నియోజకవర్గంకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సెగ్మెంట్‌లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి వ్యూహాత్మక రాజకీయాలతో ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నందున ఎంపీ రంగంలోనికి దిగినట్లు కనిపిస్తోంది. అయితే సెగ్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రచారం మొదలైనా తెరాస అభ్యర్థి అధికారిక ప్రచారం మాత్రం ఇంకా మొదలు కాలేక పోయింది. ఎంపీ కవిత ప్రచార పర్వం మొదలైతే గానీ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయన్నది చెప్పలేమని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.