నిజామాబాద్

పేదలను మోసం చేసిన తెరాసకు బుద్ధి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్ రూరల్, నవంబర్ 13: నాలుగు సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి తెరాస నిరుపేద ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం బోధన్ మండలం నాగన్‌పల్లి, పెద్దమావంది, చిన్న మావంది, జాడి, సాలూరా క్యాంప్, సాలంపాడ్, కుమ్మన్‌పల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మాట్లాడుతూ తెరాస హాయంలో ఒక్క నిరుపేద కుటుంబం కూడా సొంతింటి నిర్మాణం చేపట్టలేక పోయిందన్నారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు అందలేవన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసీఆర్ తమ స్వార్థం కోసం ప్రజలను కులాల వారీగా విభజించి పాలన సాగించారని ఇది ఎంత వరకు సమంజసమన్నారు. ఇంట్లో ఒక్కరికి మాత్రమే పెన్షన్ ఇచ్చి పేదవారికి అన్యాయం చేశారని విమర్శించారు. నేడు మరోమారు అధికారం కోసం గ్రామాలకు వస్తున్నారని అటువంటి మోసపూరిత పార్టీలకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని, కాంగ్రేస్ పార్టీకి ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ నాయకులు కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి, గంగాశంకర్, అల్లే రమేష్, నాగేశ్వర్‌రావ్, శివరాజ్ పటేల్, వీరభద్రరావ్, శ్రీనివాస్‌రావ్, రమేష్‌గౌడ్, రామక్రిష్ణారెడ్డి, నరెందర్‌రెడ్డి, పోతారెడ్డి, భూంరెడ్డి, సురేందర్‌గౌడ్, గౌసోద్దీన్, తెదేపా జిల్లా ఉపాద్యక్షుడు గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

బాల్కొండలో బీజేపీ జెండా ఎగరేయాలి
మోర్తాఢ్, నవంబర్ 13: రానున్న ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ జెండాను ఎగరవేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి రుయ్యాడి రాజేశ్వర్ అన్నారు. మోర్తాడ్‌లో మంగళవారం నియోజకవర్గస్థాయి శక్తి కేంద్రాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని, దాంతో పాటు చాలామంది ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేసి గెలుపు దిశగా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పలు సంక్షేమ పథకాల్లో సింహభాగం వాటా కేంద్ర ప్రభుత్వానిదేనని, దీని విషయంలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి బూత్ స్థాయిలో కార్యకర్తలు గెలుపు కోసం కృషి చేస్తే నియోజకవర్గ స్థాయిలో గెలుపు దానంతట అదే వస్తుందని అన్నారు. పార్టీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి డమల్‌కర్ శ్రీనివాస్, కొత్తపల్లి సంతోష్‌తో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.