నిజామాబాద్

సొమ్మొకరిది.. సోకొకరిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, నవంబర్ 13: సొమ్మొకరిది.. సోకు ఇంకొకరిదన్న చందంగా కేసీఆర్ పాలన సాగిందని ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి పీ.వినయ్‌రెడ్డి అన్నారు. మరోమారు కేసీఆర్‌ను నమ్మి కారు గుర్తుకు ఓటు వేస్తే ప్రజలకు నరకం చూపించటం ఖాయమన్నారు. మంగళవారం మాక్లూర్ మండలంలోని సట్లాపూర్, మదన్‌పల్లి, ఒడ్యాట్‌పల్లి, ముత్యంపల్లి, అమ్రాద్ తండాలలో వినయ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని పేర్కొన్నారు. 75శాతం కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటే తెలంగాణాప్రభుత్వ వాటా కేవలం 25శాతం మాత్రమే ఉందని, అయిన అంతా తమ ఘనతేనంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని వినయ్‌రెడ్డి విమర్శించారు. నిజానికి ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా కొనసాగిన జీవన్‌రెడ్డి ఆర్మూర్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిలేదన్నారు. పదవిలో ఉన్నన్ని రోజులు హైదరాబాద్‌కే పరిమితం అవుతూ, నియోజకవర్గాన్ని పార్టీ శ్రేణులకు అప్పగించి నియంతగా వ్యవహరించారని, ఈ విషయం నియోజకవర్గంలోని ప్రజలందరికి తెలిసిందేనని అన్నారు. ఇప్పటికైనా జీవన్‌రెడ్డి వ్యవహార శైలిని గుర్తెరిగి కమలం గుర్తుకు ఓటు వేయాలని వినయ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. అంతకుముందు గిరిజన తండాల్లో వినయ్‌రెడ్డికి బంజారాలు వారి ఆచారాలను వ్యవహరిస్తూ సాంప్రదాయబద్దంగా ఆటపాటలతో భారీ స్వాగతం పలికి తమ ఓటు కమలానికేనని భరోసా కల్పించారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రాజు, షబ్బీర్, మురళీ, అధిక సంఖ్యలో మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.