నిజామాబాద్

చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 15: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచాలని, అంతర్రాష్ట్ర, అంతర్‌జిల్లా చెక్‌పోస్టుల వద్ద మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు అధికారులను ఆదేశించారు. చెక్‌పోస్టుల మీదుగా వచ్చీపోయే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. గురువారం ఆయన మోస్రా, వర్ని, రుద్రూర్, కోటగిరితో పాటు బోధన్ మండలం సాలూరాలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులను ఆకస్మికంగా సందర్శించి అక్కడ చేపడుతున్న తనిఖీల పర్వాన్ని పరిశీలించారు. మోస్త్రా వద్ద ఎస్‌ఎస్‌టీ చెక్‌పోస్టులో తనిఖీలకు సంబంధించి రిజిస్టర్లలో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. చందూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యటించి పోలింగ్ కేంద్రాలు, ర్యాంపులు, విద్యుత్ సరఫరా, నీటి సరఫరా తదితర వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా కనెక్షన్‌ను తక్షణమే ఇప్పించాలని ఆదేశించారు. ఫ్యాన్లు మరమ్మత్తు చేయించి గదుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయించాలని సూచించారు. విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా? అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మెనూను తప్పనిసరిగా ప్రదర్శించాలని, దాని ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని పాఠశాల హెచ్‌ఎంను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో చెత్తా చెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించిన కలెక్టర్ నిర్వహకులను మందలించారు. తక్షణమే పాఠశాల ఆవరణను శుభ్రపర్చి, ఆ ఫొటోలను తనకు పంపించాలని గ్రామ పంచాయతీ సిబ్బందిని, అధ్యాపకులను ఆదేశించారు. అనంతరం రుద్రూర్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేయగా, డాక్టర్ దిలీప్‌కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో హాజరుపట్టికలో వారికి గైర్హాజరు వేశారు. వీరికి చార్జ్ మెమోలు జారీ చేయాలని డీఎంహెచ్‌ఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో చెక్‌పోస్టును సందర్శించి, ఎంత పరిధి దాటితే మద్యం, డబ్బులు, బహుమతులు సీజ్ చేస్తున్నారని సిబ్బందిని ప్రశ్నించారు. ఇప్పటివరకు తనిఖీలలో ఎంత నగదును సీజ్ చేశారని వివరాలు ఆరా తీశారు. బోధన్ మండలంలోని సాలూరా అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు కావడం వల్ల ఇక్కడ అత్యంత జాగరుకతతో విధులు నిర్వర్తించాలని, పొరుగునే ఉన్న మహారాష్ట్ర నుండి అక్రమంగా మద్యం, డబ్బులు దిగుమతి చేసేందుకు అవకాశం ఉన్నందున పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆయా మండలాల తహశీల్దార్లు, తనిఖీ బృందాల అధికారులు ఉన్నారు.