నిజామాబాద్

నామినేషన్ వేసిన సుదర్శన్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, నవంబర్ 19: బోధన్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి వేలాదిమంది కార్యకర్తలతో కలిసి సోమవారం నామినేషన్ వేసేందుకు తరలి వెళ్లారు. ముందుగా తన స్వగ్రామమైన నవీపేట మండలం సిరాన్‌పల్లి గ్రామంలో మాతృమూర్తి ఆశీర్వాదం తీసుకున్న సుదర్శన్‌రెడ్డి, భార్య, కుమారుడు, కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలోని హన్మాన్ మందిరంలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టాప్‌లెస్ వాహనంలో కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్థులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మార్గమధ్యలో పలు గ్రామాల ప్రజలు సుదర్శన్‌రెడ్డి వాహనాన్ని ఆపి అభినందనలు తెలియజేశారు. మండల కేంద్రమైన నవీపేటకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి వందలాది ద్విచక్ర వాహనాలు, ఆటోరిక్షాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రాగా, సుదర్శన్‌రెడ్డి వారితో కలిసి ర్యాలీగా బోధన్ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, గతంలో 15సంవత్సరాల పాటు బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, ఉమ్మడి రాష్ట్ర మంత్రిగా ప్రజా సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, అవే తన విజయానికి దోహదపడ్తాయని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చేలేదని, అంతే కాదు ఆసియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అయిన ఎస్‌ఎస్‌ఎఫ్‌ను మూసేసి, అటు కార్మికులను, ఇటు రైతులను రోడ్డుపాలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. అందువల్ల అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు మహిపాల్‌రెడ్డి, కిషోర్‌రావు, గోవర్ధన్‌రెడ్డి, ఆయా గ్రామాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు, ప్రజలు తరలి వెళ్లారు.