నిజామాబాద్

జనవరి చివరి వరకు ‘్భగీరథ’ పనులు పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, డిసెంబర్ 14: జనవరి చివరి వరకు మిషన్ భగీరథ పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్‌లో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ నీటిని త్వరితగతిన అందించేలా పనులు వేగవంతం చేయాలని సూచించారు. సింగూరు, జుక్కల్ నియోజకవర్గం నుంచి 516 ఆవాస ప్రాంతాలకు గాను 515 గ్రామాలకు ప్రతి రోజు నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ఒక గ్రామానికి సంబంధించి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా జిల్లా వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలలకు నీటిని అందించాలని అధికారులకు ఆదేశించారు. ఫారెస్ట్ నర్సరీలకు నీటి సరఫరాకు కొరకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు వివరాలు అందజేయాలని డీఎఫ్‌వో వసంతను ఆదేశించారు. బుధవారం, శనివారం సాయంత్రం 6 గంటలకు మిషన్ భగీరథ అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ యాదిరెడ్డి, ఏస్ ఈ రాజేందర్‌కుమార్, ఆర్మూర్ గ్రీడ్ ఈ ఈ నాగేశ్వర్‌రావు, బాన్సువాడ డివిజన్ గ్రీడ్ ఈఈ చౌదారి బాబు, ఆర్ డబ్ల్యూఎస్ ఈఈ లక్ష్మీనారాయణ, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.

మహాలక్ష్మీ మందిరంలో
కుటుంబ సమేతంగా ఎమ్మెల్యే పూజలు
ఆర్మూర్, డిసెంబర్ 14: ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మీ మందిరంలో శుక్రవారం ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నికల సమయంలో మహాలక్ష్మీ మందిరంలో అమ్మవారికి మొక్కుకున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, సతీమణి రజితారెడ్డిలు గెలిచిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహాలక్ష్మీ అమ్మవారికి ముక్కు పుడక, చీర బహూకరించారు. ఇటీవలి ఎన్నికల్లో ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా జీవన్‌రెడ్డి విజయం సాధించిన సందర్భంగా వారు మొక్కు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ స్వాతిసింగ్, వైస్ చైర్మన్ లింగాగౌడ్, నాయకులు యామాద్రి భాస్కర్, బండారి మధు, పడాల్ గణేష్, మదన్‌మోహన్, కలిగోట సుదర్శన్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఫసల్ బీమాయోజన పథకంపై
రైతులకు అవగాహన కల్పించాలి
- జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి
కామారెడ్డి, డిసెంబర్ 14: ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు. శుక్రవారం జనహిత భవన్‌లో వ్యవసాయ అధికారులు, బ్యాంక్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి మాట్లాడుతూ, యాసంగిలో ఎక్కువగా అకాల వర్షాలు పడుతాయని, ప్రతీ రైతు పంటల బీమా తప్పని సరిగా చేసుకునేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని ప్రతీ గ్రామంలో రైతులు పంటల బీమా ప్రీమియంను చెల్లిస్తే ఆకాల వర్షాల వలన రైతులు నష్టపోకుండా ఉంటారని పేర్కొన్నారు. పంటలకు బీమా చేయడంతో రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్స్‌రెన్స్ కంపెనీలు సకాలంలో నష్టపరిహారం అందించేలా కృషిచేయాలని సూచించారు. ఇన్స్‌రెన్స్ కంపెనీలు, వ్యవసాయ అధికారులకు రైతులకు సహాకరించాలని కోరారు. ఏ ఈవోలు గ్రామాల్లో బాగా పని చేసి రాష్ట్రంలోనే జిల్లాను అత్యుత్తమంగా ఉంచేలా కృషిచేయాలని సూచించారు. పంట కోత ప్రయోగాలు, గ్రామాల్లో ఎక్కువగా చేసి రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పించాలనికోరారు. పంట కోత ప్రయోగానికి గ్రామాలల్లోని వీ ఆర్ ఏలు సహాకరించేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు ఆంజిరెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేంద్రయ్య, సీపీవో శ్రీనివాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, వెంకటేశ్వర్లు, ఏ డీ ఏలు, మండల వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

నేటి ఓటమి రేపటి గెలుపునకు నాంది
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి
తాడ్వాయి, డిసెంబర్ 14: నేటి ఓటమి రేపటి గెలుపు కోసమేనని కామారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం ఆయన తాడ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడి గ్రామంలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, గత ఎన్నికలో బీజేపీ పార్టీ ఓడి పోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు నిరుత్సాహా పడోద్దని రాజకీయంలో గెలుపు, ఓటములు సహాజమేనని మనం ప్రజల మద్య ఉండి ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఆయన కార్యకర్తలకు సూచించారు. ఎన్నికల కోసం కృషి చేసిన ప్రతీ కార్యకర్తకు, నాయకులకు ఈసందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరాలో జరుగబోయే స్థానిక ఎన్నికల పట్ల ఇప్పటి నుంచే కసరాత్తు మొదలు చేయాలని ఆందుకు సంబంధించిన ప్రణాళికలను నాయకులు సిద్దం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు షెరుబద్దం రమణారెడ్డి, నాయకులు రవీందర్‌రావు, రామారాజు, సాయిలు, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.