నిజామాబాద్

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 17: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు, సిబ్బంది అందరూ సన్నద్ధం కావాలని కలెక్టర్ ఎం.రామ్మోహన్‌రావు సూచించారు. ఇటీవల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎక్కడ కూడా ఏ ఒక్క అవాంఛనీయ ఘటనకు సైతం ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించడం జరిగిందని, అదే స్ఫూర్తితో పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం కావాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా దాదాపు రెండు నెలల విరామం అనంతరం సోమవారం స్థానిక ప్రగతిభవన్‌లో ప్రజావాణి కార్యక్రమాన్ని పునరుద్ధరించారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన అనంతరం ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా అధికారులు, సిబ్బంది అందరూ ఎంతో చురుకుగా విధులు నిర్వర్తించారని, అందరి కృషితోనే ఎన్నికలను సాఫీగా నిర్వహించుకోగలిగామని అభినందించారు. ఇదే తరహాలో మునుముందు రానున్న పంచాయతీ, సహకార, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలను కూడా పకడ్బందీగా నిర్వహించి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. వచ్చే ఆరు నెలలు ఒకదాని వెంట ఒకటిగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాల్సిన ఆవశ్యకత నెలకొందన్నారు. అదే సమయంలో ప్రభుత్వ ప్రాధామ్యాల అమలులో ఎలాంటి విఘాతం ఏర్పడకుండా చూసుకోవాలన్నారు. ప్రధానంగా సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ, నిర్ణీత గడువులోగా లక్ష్యాలు సాధించాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయాన్ని పెంపొందించుకుని ఆయా కార్యక్రమాల అమలును వేగవంతం చేయాలని, ప్రాధాన్యతతో కూడుకున్న వాటి ప్రగతి గురించి తాను ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతానని పేర్కొన్నారు. ఇదివరకు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేకూర్చిన లబ్ధి, అందించిన సేవలను మరింత విస్తృతం చేయాలన్నారు. ఎన్నికల దృష్ట్యా ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగించలేకపోయినప్పటికీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వాటిని పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ రాథోడ్ రమేష్, డీపీఓ కృష్ణమూర్తి, నిజామాబాద్ ఆర్డీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

రేపటి నుండి
బతుకమ్మ చీరల పంపిణీ
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, డిసెంబర్ 17: ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న కారణంగా వాయిదా పడిన బతుకమ్మ చీరల పంపిణీపై ప్రభుత్వం తాజాగా దృష్టిసారించింది. ఈ నెల 19వ తేదీ నుండి వీటి పంపిణీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే.జోషి జిల్లా కలెక్టర్‌కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. 19వ తేదీ నుండి బతుకమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరూ పాల్గొనేలా చూడాలని, రోజువారీ పంపిణీకి సంబంధించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించారు. బతుకమ్మ చీరలను ఇప్పటికే జిల్లాలకు పంపించామని, ఐదారు రోజుల్లో వాటి పంపిణీ పూర్తయ్యేలా చూడాలన్నారు. కాగా, జిల్లాలో 5.27లక్షల బతుకమ్మ చీరలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4.21లక్షల చీరలను మాత్రమే కేటాయించారని, మిగతా లక్షా 5వేల చీరలను కూడా పంపించాలని కలెక్టర్ ఎంఆర్‌ఎం.రావు సీఎస్ దృష్టికి తెచ్చారు. అయితే జిల్లా కేంద్రంలోని గిడ్డంగుల్లో ఉన్న బతుకమ్మ చీరలను గ్రామ స్థాయి వరకు చేరేలా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ సూచించారు. గ్రామ స్థాయిలోని ప్రతి గిడ్డంగికి ఇన్‌చార్జ్‌లను నియమించాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీలలో పంపిణీకి సంబంధించి మహిళా సంఘాలు, అధికారులు, వార్డు కమిటీలను నియమించి ఎప్పటికప్పుడు పంపిణీ ప్రక్రియను సమీక్షించాలని ఆదేశించారు. జిల్లాల వారీగా లబ్ధిదారుల జాబితాలు ఈపీడీఎస్ పోర్టల్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలించి గ్రామాల వారీగా జాబితాలు రూపొందించుకోవాలని సూచించారు. బతుకమ్మ చీరల పంపిణీ తేదీల గురించి ఆయా గ్రామాల ప్రజలకు ముందుగానే తెలియపర్చాలని అన్నారు. జౌళి, చేనేత శాఖ కమిషనర్ శైలజారామయ్యర్ మాట్లాడుతూ, దాదాపు 90లక్షల చీరలు పంపిణీ చేస్తున్నామని, ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, జూనియర్ గ్రామ కార్యదర్శుల నియామకం, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, జాతీయ రహదారుల విస్తర్ణకై భూసేకరణ, క్రిస్మస్ బహుమతుల పంపిణీ తదితర అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు పలు సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఓ రాథోడ్ రమేష్, డీపీఓ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.