నిజామాబాద్

డెక్కన్ సుగర్స్ కార్మికుల రాస్తారోకో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, మే 19:చర్చల పేరిట హైదరాబాద్‌కు పిలిపించి ఎటువంటి చర్చలు జరుపకుండా తమను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదంటూ ప్రజాప్రతినిధుల తీరును నిరసిస్తూ గురువారం డెక్కన్ సుగర్స్ కార్మికులు రాస్తారోకో చేపట్టారు. తమను ఆదుకోవాల్సిన ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. గత నాలుగు మాసాలుగా లే ఆఫ్ నిర్ణయం వలన తాము ఆర్థిక ఇబ్బందులలో కూరుకుపోయామని అనేక సార్లు తమ పరిస్థితిని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకుపోయామని కానీ తమను ఆదుకునేందుకు ఎటువంటి చొరవ చూపడం లేదని విమర్శించారు. స్థానిక సాత్‌పూల్ కెనాల్ వద్ద బైఠాయించి రాస్తారోకో చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.