నిజామాబాద్

ఈదురు గాలుల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్ రూరల్, మే 19: బోధన్ మండలంలో గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు అతివేగంతో కూడుకున్న ఈదురు గాలుల వర్షం ఇరవై నిముషాల పాటు బీభత్సాన్ని సృష్టించింది. అనేక గ్రామాలలో ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంబాలు విరిగిపోయాయి. ఆచన్‌పల్లి శివారులో ఆర్టీసి బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. అతివేగంతో వీచిన ఈదురు గాలులకు ఆచన్‌పల్లి శివారు వద్ద ఓ భారీ వృక్షం నేలకొరిగింది. అదే సమయంలో ఆర్టీసి రహదారిపై రావడం, వృక్షం పడే ప్రమాదం ఉందని గమనించి డ్రైవర్ వేగంతో బస్సును ముందుకు తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పి ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే మండలంలోని ఎరాజ్‌పల్లి, అమ్దాపూర్, ఊట్‌పల్లి గ్రామాలలో ఈదురు గాలుల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ గ్రామాలలో అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంబాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంబాలు క్రిందకి వంగి పోవడంతో ట్రాన్స్‌కో అధికారులు ఆయా గ్రామాలకు సాయంత్రం వరకు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఇరవై నిముషాల పాటు ఈదురు గాలులు వీయడం దీనికి తోడు వర్షం కురియడంతో గ్రామీణ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు.