నిజామాబాద్

చెరువు పనుల్లో నాణ్యతను పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజాంసాగర్, మే 19: తెలంగాణ ప్రభుత్వం ఎంతోప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం కింద మంజూరైన చెరువు పనులలో నాణ్యత లోపించకుండా నిర్మించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఇంజనీరింగ్ అధికారులకు, సంబందిత కాంట్రాక్టర్‌లకు ఆదేశించారు. గురువారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటిపారుదల అతిథిగృహంలోఐదు మండలాల ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్‌లతోసమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ, జుక్కల్ నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో మొదటి విడత మిషన్ కాకతీయ పథకం కింద 106 చెరువులు మంజూరైయ్యాయన్నారు. చెరువుల ఆదునీకరణ కోసం ప్రభుత్వం 35 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందన్నారు. వీటిలో ఇప్పటి వరకు 81 చెరువు నిర్మాణం పనులు పూర్తిచేయడం జరిగిందన్నారు. మిగితా 25 చెరువులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఈచెరువులన్నింటిని ఈనెలఖరులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. పనులు ఎన్నిరోజుల్లో పూర్తిచేస్తారని కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులనుంచి సమాదానాన్ని ఎమ్మెల్యే రాబట్టారు. చెరువు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకుటే శాఖపరమైన చర్యలు తప్పవన్నారు. రెండవ విడత మిషన్ కాకతీయ పథకం కింద 92 చెరువులకు గాను 22 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వర్షాకాలం ప్రారంభమైయ్యేలోగా చెరువుతూము పనులు త్వరితగతిన పూర్తిచేసుకునేలా అన్నిరకాల చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈసమావేశంలోపిట్లం ఎంపిపి రజనీకాంత్‌రెడ్డి, నీటివినయోగదారుల సంఘం అధ్యక్షులు గంగారెడ్డి, డిఇఇ సురేష్‌బాబు, ఎఇలు శివకుమార్, బాసిత్, గంగభూషణ్ పాల్గొన్నారు.