నిజామాబాద్

గ్రామాల్లో తిరగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, జూన్ 17: ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులకు వరప్రదాయినిగా మారనున్న ఎత్తిపోతల పథకాలను అడ్డుకునే పార్టీలను, నాయకులను గ్రామాల్లోకి రానివ్వమని మోర్తాడ్‌లోని వ్యవసాయదారుల సంఘం ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం సంఘ భవనంలో సమాశమైన భీమ్‌గల్ పాత తాలుకా స్థాయి మండలాల రైతు ప్రతినిధులు నాయకుల పనితీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో పాటు 50టిఎంసిల సామర్థ్యంతో నిర్మించనున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న శక్తుల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తీర్మానించారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతాయని, భారీగా నష్టపోతారని అక్కడి రైతులను రెచ్చగొట్టి, వారి భూములు ఇవ్వకుండా చేసి, తద్వారా రిజర్వాయర్ నిర్మాణాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడ కూడా ప్రాజెక్టులను గాలిలో కట్టలేదని, భూములు ముంపునకు గురికానిదే ప్రాజెక్టుల నిర్మాణం జరుగదని అన్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో నష్టపోతున్న రైతులకు ప్రభుత్వం మంచి నష్టపరిహారాన్ని ఇస్తున్నప్పటికీ, కొన్ని పార్టీల నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తూ 4వేల గ్రామాల రైతుల నోట్లో మన్నుపోసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మల్లన్నసాగర్ గ్రామాలకు వెళ్లి రాజకీయం చేస్తున్న నాయకులను, శక్తులను, పార్టీల అంతుచూస్తామని, భవిష్యత్‌లో వారిని తమ గ్రామాల్లోకి అడుగు పెట్టనీయబోమంటూ నిర్ణయించారు. త్వరలోనే జిల్లా స్థాయిలోనూ, హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయిలో రైతు సదస్సును ఏర్పాటు చేసి ప్రాజెక్టుల నిర్మాణానికి అనుకూలంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని రైతు ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి కూడా లేఖలు రాయనున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశంలో మోర్తాడ్, వేల్పూర్, బాల్కొండ, భీమ్‌గల్ తదితర మండలాలకు చెందిన రైతులతో పాటు వ్యవసాయ సంఘం అధ్యక్షుడు రెంజర్ల గంగారాం, కార్యవర్గ సభ్యులు తీగల రమేష్, బిజి.గంగారాం పాల్గొన్నారు.