నిజామాబాద్

రైతు సంక్షేమానికి టిఆర్‌ఎస్ కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, జూన్ 17: రైతుల సంక్షేమం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర భారీ నీటి పారుదల, మార్కెటింగ్ శాఖ మాత్యులు తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని సత్యగార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకారమహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరువాత, రైతాంగం అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని, రైతులకు న్యాయం చేయడమే తమ సర్కార్ లక్ష్యం అని అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఇంటిగ్రేటెడ్(సర్వదుకాణ సముదాయం) మార్కెటింగ్ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. త్వరలో కామారెడ్డి జిల్లా కాబోతోందని, ఈ ప్రాంతం టిఆర్‌ఎస్ సర్కార్ పాలనలో మరింత అభివృద్ధి సాదిస్తోందని అన్నారు. మార్కెట్ రైతుల అభివృద్ధి కోసం 3కోట్ల రూపాయల నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు. మార్కెట్ కమిటీ చైర్మెన్‌లు, పాలక వర్గాలు రైతుల సంక్షేమం కోసం కృషి చేయాల్సిందిగా సూచించారు. కామారెడ్డి పెద్ద చెరువు చాలా అద్భుతంగా ఉందని, ఈ చెరువును మీనీ ట్యాంక్‌బండ్‌గా తీర్చి దిద్దడం జరుగుతోందని అన్నారు. 9కోట్ల రూపాయలతో మీనీ ట్యాంక్‌బండ్ చెరువు అభివృద్ధి పనులు త్వరలోనే జరగనున్నాయని అన్నారు. అంతకు ముందు కామారెడ్డి పట్టణానికి చేరుకున్న సందర్భంగా టిఆర్‌ఎస్ నాయకులు భారీ బైక్ ర్యాలీతో మంత్రికి స్వాగతం పలికారు. ఆర్‌అండ్‌బి అతిథిగృహం ముందు కార్యకర్తలు టపాసులు కాల్చారు. కామారెడ్డి పెద్దచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు శంకుస్థాపన చేశారు. అనంతరము మంత్రి అతిథిగృహం నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎడ్లబండిపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. ఈకార్యక్రమంలో మంత్రితో పాటు ప్రభుత్వవిప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంపగోవర్ధన్, జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్, ఐడిసిఎంఎస్ చైర్మెన్ ముజిబొద్దిన్, నూతన మార్కెట్ చైర్మన్‌లు గట్టగోని రాజమణిగోపిగౌడ్, బాణాల అమృత్‌రెడ్డితో పాటు పాలక వర్గం సభ్యులు, అధికారులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.