నిజామాబాద్

చివరి ఆయకట్టుకు కూడా నీరందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, జూన్ 17: తెలంగాణ భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని, ప్రతి సెంటు భూమికి నీరందిస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు భూమికి కూడా నీరందించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. మోర్తాడ్ మండలం గుమ్మిర్యాల్‌లలో 12.40కోట్లతో చేపట్టిన గుమ్మిర్యాల్ ఎత్తిపోతల పథకానికి ఎంపి కవిత, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డితో కలిసి మంత్రి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాలను పూర్తిస్థాయిలో రైతులకు అందిస్తామని తెలిపారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి ప్రాజెక్టులన్నీ జలకళతో తొణికసలాడాలని ఆయన అభిలాష వ్యక్తం చేశారు. స్వయాన ముఖ్యమంత్రి కూతురు జిల్లా ఎంపి కావడం, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ముఖ్యమంత్రికి సన్నిహితుడు కావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పథకాలకు, సాగునీటి పథకాలకు నిధులు కేటాయించామని, ఇంకా ప్రజలు కోరుతున్నట్లుగా కాకతీయ కాల్వ చివరి ఆయకట్టు గ్రామాలుగా ఉన్న తడ్‌పాకల్, తాళ్లరాంపూర్ గ్రామాలకు కూడా త్వరలోనే ఎత్తిపోతల పథకాన్ని మంజూరీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఎంపి కవిత మాట్లాడుతూ, అభివృద్ధియే లక్ష్యంగా పని చేస్తున్న మంత్రి హరీశ్‌రావు ఆరడుగుల బూల్లెట్ అని, కోరిన వెంటనే నిధులు మంజూరీ చేస్తూ రైతులకు అండగా ఉంటున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, పెద్దవాగులో చెక్‌డ్యామ్‌లు, హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం, గట్టుపొడిచిన వాగు తదితర పథకాలకు కోరిన వెంటనే నిధులు మంజూరీ చేసిన హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలుపుతూనే, నియోజకవర్గంలోని పలు సాగునీటి పథకాలకు మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కల్లెడ చిన్నయ్య, గుమ్మిర్యాల్ సర్పంచ్ లావణ్య, ఎంపిటిసి లింగారెడ్డి, జడ్పీటిసి అమిత, ఎత్తిపోతల పథకం కమిటీ సభ్యుడు, టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, ఉపాధ్యాక్షుడు రాజాపూర్ణానందం, మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, డిసిసిబి డైరెక్టర్ సోమ చిన్నగంగారెడ్డితో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నీటి పారుదల శాఖ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఇటు హర్షం .... అటు వర్షం
మోర్తాడ్ మండలం గుమ్మిర్యాల్‌లలో మంత్రి హరీశ్‌రావు పర్యటనకు భారీ వర్షంతో స్వాగతం పలికారు. గుమ్మిర్యాల గోదావరి నదిలో 12.40కోట్లతో చేపడుతున్న ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి కాన్వాయ్ సభా వేదికకు చేరుకుంది. అప్పటికే ఆకాశం మేఘావృతం కావడంతో భారీ వర్షం కురుస్తుందన్న సూచనలు కనిపించడంతో సమావేశాన్ని త్వరగా ప్రారంభించారు. ఎంపి కవిత ప్రసంగం ప్రారంభం కాగానే భారీ వర్షం కురియడంతో సమావేశానికి హాజరైన రైతులు హర్షం వ్యక్తం చేశారు. కవిత కూడా తొలకరి వర్షంతో వరుణుడు ఎత్తిపోతల పథకానికి హర్షం వ్యక్తం చేస్తున్నాడని పేర్కొనడంతో అంత వర్షంలోనూ మహిళలు నినాదాలు చేశారు. భారీ వర్షం కురియడంతో మంత్రి హరీశ్‌రావు తన ప్రసంగాన్ని నాలుగు నిమిషాలకే పరిమితం చేశారు.
ఎంతో ఆశతో హరీశ్‌రావు ప్రసంగం విందామని వేచి చూసిన నాయకులు, కార్యకర్తలకు నిరాశే మిగిలినా, భారీ వర్షం కురియడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. భారీ ఈదురు గాలులతో 40నిమిషాల పాటు కుంభవృష్టి కురిసింది. చుట్టు ప్రక్కల వేసిన టెంట్లు కూడా కూలిపోయే పరిస్థితి ఏర్పడటంతో ప్రజలంతా సభా వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. వేదిక కూలిపోతుందని, పైకి ఎక్కవద్దని స్థానికులు కోరడంతో అదే వర్షంలో గ్రామస్థులంతా గ్రామానికి పరుగులు తీశారు. మొత్తానికి హరీశ్‌రావు పర్యటనతో గ్రామం హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. అంతకు ముందు గ్రామంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మంత్రి హరీశ్‌రావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.