నిజామాబాద్

ఏడేళ్ల అధికారంలో కమిషన్లు దండుకున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ: 2007నుండి 2014వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, లక్ష్మి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంప్‌లు, మోటార్లను కొనుగోలు చేసి అందినకాడికి కమిషన్లను దండుకున్నారని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నిర్మిస్తున్న లక్ష్మి లిఫ్ట్ పనులను హరీశ్‌రావు సందర్శించిన అనంతరం స్థానిక విలేఖరులతో మాట్లాడారు. నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా లక్ష్మి లిఫ్ట్‌ను తయారు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని, ప్రాజెక్టుల కోసం ఎలాంటి భూసేకరణ చేయకుండా మెటీరియల్ కొనుగోలు చేసి కమీషన్లు దండుకుని రైతుల ఉసురుపోసుకున్న ఘనత సైతం కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. లక్ష్మి లిఫ్ట్ పనులను వేగవంతం చేసేందుకు గాను పాత కాంట్రాక్టర్‌ను తొలగించి, కొత్తవారికి పనులను అప్పగించి వేగం పెంచామని అన్నారు. తద్వారా పనులు 99శాతం పూర్తయ్యాయని, దీంతో ఈ నెలాఖరు నాటికి కనీసం రెండు మోటార్ల ద్వారానైనా నీరందించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి అర్గుల రాధ, మార్కెట్ కమిటీ చైర్మన్ పుట్ట లలిత, బస్సాపూర్ సర్పంచ్ లింగస్వామి, తెరాస రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, వెంకట్‌రెడ్డి, ఐడిసి ఎండి శ్రీదేవి, ఆర్డీఓ యాదిరెడ్డితో పాటు తెరాస నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.