నిజామాబాద్

వందమంది ఆంధ్రబాబులు అడ్డుపడ్డా మల్లన్నసాగర్ ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భిక్కనూరు, జూన్ 17: ఒక చంద్రబాబు కాకుండా జగన్‌బాబు, వందమంది ఆంధ్రబాబులు అడ్డువచ్చినా తెలంగాణ రాష్ట్రంలో మల్లన్న సాగర్ ప్రాజెక్టును కట్టి తీరుతామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీర్ హరీశ్‌రావు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని జంగంపల్లి చెరువులో పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి ఆవేశపూరితంగా ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకుంటే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి కావలంటూ ఆగ్రహాం వ్యక్తం చేశారు. జగన్ కూడా మల్లన్న ప్రాజెక్టుపై నిరసన తెలియచేయడం తగదన్నారు. 25వేల కోట్లతో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సిఎం కెసిఆర్ భావిస్తే ప్రాజెక్టు కట్టకుండా కాంగ్రెస్ వారు పంచాయతీ మొదలు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జెఎసి, టిడిపి నేతలు ప్రజలను రెచ్చగొడుతూ ప్రాజెక్టును అడ్డుకునే విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నల్గొండ, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు మల్లన్న ప్రాజెక్టు పూర్తయితే 1100గ్రామాలకు గోదావరి జలాలు వస్తాయన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా 5,6 గ్రామాలు ముంపుకు గురి అవుతాయని స్పష్టం చేశారు. ముంపు గ్రామాల బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించేందుకు సిద్దంగా ఉందన్నారు. మల్లన్న సాగర్ నుండి కుడవెళ్లి అప్పర్ మానేరు నుండి చిన్న లిప్టు ద్వారా తలమండ్లలో నిర్మించే 5టిఎంసిల రిజర్వేయర్‌కు నీళ్ళు వస్తాయన్నారు. దీంతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలను సస్యశ్యామలం చేయవచ్చన్నారు. ప్రజలను రెచ్చగొట్టే వైఖరిని మానుకోని ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టుల నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు. 2013లో భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టులు కడితే భూములు కొల్పొయిన రైతులకు 123జీవోప్రకారం నష్టపరిహారం అందిస్తామని, దీనికి పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ జీవో రైతులకు శాపమంటూ విమర్శలు చేయడం తగదన్నారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలు కరువుతో అల్లాడుతున్నాయనే ఉద్దేశ్యంతో సిఎం కెసిఆర్ ఈ కార్యక్రమానికి స్వీకారం చుడితే అడ్డుతున్న జెఎసి, టిడిపి, కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు వివరించారు. ప్రతిపక్షాలు అభివృద్ధి పనులకు సహకరించాలని సూచించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఒక చెరువును కూడా అభివృద్ధి చేయలేదన్నారు. 800సంవత్సరాల తర్వాత టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక చెరువుల అభివృద్దికి కృషి చేస్తుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కాకపోవడం వల్ల 1000టిఎంసిల నీరు సముద్రంలో కలుస్తుందన్నారు. నీటిని వినియోగించుకునేందుకు మల్లన్న ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందుతోందన్నారు. నిరుపేద విద్యార్థులను ఆదుకునేందుకు రాష్ట్రంలో 250 రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించామని, మరో 30మహిళ కళాశాలలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ కింద వచ్చే యేడాదిలోగా ఇంటింటికి కుళాయి నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఐడిసిఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, ఎంపిపి అధ్యక్షురాలు దొమ్మాట రాణి, జడ్పిటిసిలు నంద రమేశ్, గండ్ర మదుసుధన్‌రావు, మండల పార్టీ అధ్యక్షులు జుకంటి మోహన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి అందె మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు కొమ్ముల తిర్మల్‌రెడ్డి, భిక్కనూరు ఎఎంసి చైర్మన్ బాణాల అమృత్‌రెడ్డి, సర్పంచ్‌లు నర్సింహారెడ్డి, గుండా రేణుక, మామిడి రవిందర్‌రెడ్డి, జంగం శ్రీశైలం, భూమయ్య, ఎ.్భమయ్య, సొసైటి చైర్మన్లు మద్దూరి నర్సింలు, వంగెటి చిన్ననర్సారెడ్డి, మార్పు రవిందర్‌రెడ్డి పాల్గొన్నారు.