నిజామాబాద్

కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న దుకాణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, జూలై 3: బోధన్ పట్టణంలో రంజాన్ ధమాకా అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఆదివారం పాత మార్కెట్ కొనుగోలు దారులతో పట్టణంలోని కిటకిట లాడుతోంది. ఉదయం నుండీ అర్థరాత్రి రెండు గంటల వరకు అమ్మకాలు కొనసాగాయి. ఇందుకోసం దుకాణా దారులు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేసారు. పండుగకు ఇంకా కేవలం రెండు రోజుల గడువుమాత్రమే ఉండటంతో పట్టణంలోని ముస్లీంలే కాకుండా చుట్టు ప్రక్కల గ్రామాలకు చెందిన ముస్లీంలు సైతం ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. రంజాన్ కొనుగోళ్లతో పట్టణంలో పండుగ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మొన్నటి వరకు వర్షాలు కురియడంతో ఇక్కడ వ్యాపారాలు అంతగా కొనసాగలేక పోయాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముకం పట్టడం, పండుగ సమయం దగ్గర పడటం వలన కొనుగోళ్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఏడాది కోసారి వచ్చే రంజాన్ పండుగకు ముస్లీంలంతా నూతన వస్త్రాలు ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఇళ్లల్లో సేమియాలతో పాయాసం చేసి వింధు బోజనాలు ఏర్పాటు చేస్తుంటారు. బోధన్ ఏరియాలో ముస్లీంల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇక్కడ రంజాన్ పండుగ వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నెల రోజుల పాటు ఇక్కడ రంజాన్ మాసం సందర్బంగా హరీస్ వంటకాలు ఘుమఘుమ లాడాయి. కాగా నేడు పాతబస్టాండ్, వీక్లీ మార్కెట్ చౌరస్తాలలో రంజాన్ పండుగకు సంబంధించిన సామాగ్రి దుకాణాలు పెద్ద ఎత్తున వెలిశాయి. బట్టల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. పాత బస్టాండ్‌లోని బట్టలు, రెడిమెడ్ దుకాణాల వ్యాపారులు రంజాన్ కోసం అనేక రకాల ఆఫర్‌లు ప్రకటించారు. పోటాపోటీగా మైకులతో తమ వ్యాపారాలకు సంబంధించి ప్రచారం కూడా నిర్వహించారు. యువకులంతా రెడిమేడ్ దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. టైలర్ దుకాణాలు కూడా బిజీగా ఉండటంతో ముస్లీం యువకులు ఎక్కువగా రెడిమేడ్‌కు ప్రాధాన్యత నిస్తున్నారు. ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా బట్టల దుకాణాలు మహిళలతో కిటకిట లాడుతున్నాయి. అలాగే అత్తర్, చెప్పులు, బెల్టుల దుకాణాలలో విపరీతమైన గిరాకీ కనిపిస్తోంది. బ్యాంగిల్ స్టోర్స్‌లలో మహిళలు కొనుగోళ్ల కోసం క్యూలు కడుతున్నారు. భారీ సంఖ్యలో మహిళలు తరలి రావడంతో దుకాణాలన్నీ నిండిపోతున్నాయి. రంజాన్ పండుగ రోజున ఇళ్లల్లో తయారు చేసే షేమియా పాయాసానికి సంబంధించి వెలసిన దుకాణాలలో కూడా అమ్మకాలు ఊపందుకున్నాయి. ఈ దుకాణాలు కూడా పోటాపోటాగా ఏర్పాటు చేశారు. వీటి కొనుగోళ్లకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. వ్యాపారులు మహారాష్ట్ర నుండి అనేక రకాల షేమియాలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి అర్థరాత్రి వరకు అమ్మకాలు జరుగుతుండటంతో పాతబస్టాండ్ కళకళ లాడుతోంది. శనివారం జగ్‌నేకారాత్ కావడం, ఆదివారం వారాంతపు సంత కావడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు భారీ సంఖ్యలో కొనుగోళ్ల కోసం తరలి రావడంతో పాతబస్టాండ్ రంజాన్ అమ్మకాలతో కళకళ లాడింది.