నిజామాబాద్

హరితహారంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 5: జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమయ్యే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పిలుపునిచ్చారు. మంగళవారం ప్రగతి భవన్ సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమంపై జిల్లాస్థాయి చేంజ్ ఏజెంట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమానికి వర్షాలు అనుకూలంగా ఉండటం సంతోషించదగ్గ విషయమన్నారు. జూలై 22నాటికి పూర్తిస్థాయిలో మొక్కలు నాటేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆమె కోరారు. 3.35 కోట్ల మొక్కలను ప్రతి గ్రామానికి 40వేల చొప్పున ఖచ్చితంగా నాటించడానికి సంబంధిత అధికారుల పర్యవేక్షణ చేయాలన్నారు. 8వ తేదీన అందరు ప్రభుత్వ ఉద్యోగులు అన్ని స్థాయిలో వారి సొంత కార్యాలయాల్లో మొక్కలు నాటాలన్నారు. 10వ తేదీన ప్రతి ఇంటి పరిసరాల్లో ఐదు చొప్పున పూలు, పండ్ల మొక్కలను నాటుకోవాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం పకడ్బందీగా పూర్తి చేయడానికి మండల స్థాయిల్లో కూడా చేంజ్ ఏజెంట్లను నియమించాలని, సంబంధిత మండలానికి చెందిన తహశీల్దార్లు, ఎంపిడిఓలు, ఇఓపిఆర్‌డిలు, ఎంఇఓలు, ఎఓలు, అన్ని ఇంజనీరింగ్ విభాగాల సహాయ ఇంజనీర్లు, ఉద్యానవన అధికారులు, పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందిని మండల స్థాయి చేంజ్ ఏజెంట్లుగా నియమించాలన్నారు. పారా మెడికల్ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ సంఘాలు, విద్యా సంస్థలు, యువజన సంఘాలు, ఎంపిటిసి సభ్యులు, వార్డు మెంబర్లు ఉపాధి హామీ మేట్స్, నోడల్ అధికారులు, విఆర్‌ఓలు, పంచాయతీ కార్యదర్శులు, విఆర్‌ఓలు తదితర అధికారులు, ఉద్యోగులు వారి స్థాయిలో దత్తత తీసుకుని మొక్కలు నాటాలని సూచించారు. ప్రతి శాఖ వారి పరిధిలోని, అన్ని కార్యాలయాల్లో మొక్కలు నాటించాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కలు నాటే రోజుకు ఒకరోజు ముందుగానే ఆయా గ్రామ పంచాయతీలకు మొక్కలు చేరవేసేలా అధికారులు చర్యలు తీసుకావాలన్నారు. అన్ని దేవాలయాలు, ప్రార్థనా స్థలాల్లో కూడా మొక్కలు నాటించాలన్నారు. జిల్లాలో 3.50లక్షల ఈత చెట్లను సంబంధిత సంఘాల ఆధ్వర్యంలో నాటించాలని, 1.35కోట్ల ఇతర మొక్కలను గట్లు, బ్లాక్ ప్లాంటేషన్లలో నాటాలన్నారు. రోడ్లకు ఇరువైపులా 23.54లక్షలు, నివాస పరిసరాల్లో 27.63లక్షలు, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో 3లక్షలు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలలో 12.75లక్షలు, కమ్యూనిటీ స్థలాల్లో 40.35లక్షలు, హౌసింగ్ కాలనీల్లో 99వేల మొక్కలు నాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా అటవీ ప్రాంతంలో 44.59లక్షలు, ఇతర ప్రాంతాల్లో కలిపి మొత్తం 3.35కోట్ల మొక్కలు నాటడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇందుకు గాను 3.45కోట్ల మొక్కలను జిల్లాలో వివిధ ప్రాంతాల్లో డ్వామా, అటవీ శాఖల ఆధ్వర్యంలోని నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పీ విశ్వప్రసాద్, సంయుక్త కలెక్టర్ రవీందర్‌రెడ్డి, డిఆర్‌ఓ పద్మాకర్, డ్వామా పిడి వెంకటేశం, డిఎఫ్‌ఓ సుజాతతో పాటు జిల్లా స్థాయి చేంజ్ ఏజెంట్లు, పిడిలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.