నిజామాబాద్

అలంకారప్రాయంగా ‘ఎత్తిపోతలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, జూలై 5: మోర్తాడ్ మండలంలోని పాలెం, తొర్తి గ్రామాల సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చేపట్టిన ఎత్తిపోతల పథకాలు అలంకారప్రాయంగా మిలిగిపోతున్నాయి. దాదాపు మూడున్నర కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పథకాలను నిర్వహించేందుకు పూర్తిస్థాయి కమిటీలు కూడా లేకపోవడంతో ప్రస్తుతం ఆ రెండు పథకాలు రైతులకు ఎండమావులే అయ్యాయి. పాలెం, తొర్తి శివార్ల గుండా ప్రవహించే పెద్దవాగులో 9సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. కోటీ 90లక్షలతో పాలెం, కోటీ 70లక్షలతో తొర్తి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, పనులను కూడా సకాలంలోనే పూర్తి చేసింది. ప్రత్యేక సబ్ స్టేషన్లు, చెరువుల వరకు పైప్‌లైన్ నిర్మాణాలు కూడా పూర్తి చేసుకున్న ఈ పథకాలు మూడు సంవత్సరాల పాటు కొంతమేర నీటిని అందించగలిగాయి. అయితే ఎత్తిపోతల పథకాలను నిర్వహించేందుకు గాను గ్రామస్థాయిలో ప్రత్యేక కమిటీలను నియమించాల్సి ఉంది. దీని విషయంలో నీటి పారుదల శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో ఆ రెండు పథకాలు కూడా నిర్వాహణకు దూరంగానే మిగిలిపోతున్నాయి. పెద్దవాగులో భూగర్భజలమట్టం కూడా అడుగంటిపోయింది.