నిజామాబాద్

అభివృద్ధిలో యువత భాగస్వామి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోర్తాడ్, జూలై 5: దేశ సమగ్ర అభివృద్ధిలో యువత అంకితభావంతో భాగస్వాములు కావాలని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ రాష్ట్ర భౌద్ధిక్ బూర్ల దక్షిణామూర్తి పిలుపునిచ్చారు. మోర్తాడ్ మండలం గుమ్మిర్యాల్‌లో మంగళవారం గుమ్మిర్యాల శాఖ ఆధ్వర్యంలో గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దక్షిణామూర్తి మాట్లాడుతూ, ఆర్‌ఎస్‌ఎస్‌లో గురువుగా వ్యక్తిని కాకుండా హిందుత్వానికి విజయ చిహ్నం అయిన కాషాయ పతాకానే్న స్వీకరించడం జరిగిందన్నారు. స్వయం సేవకులు అత్యంత పవిత్రంగా దీనిని పూజిస్తూ హిందూ సంఘటనమే లక్ష్యంగా పని చేయాలని, తనువు, ధనము, మనస్సు సమర్పించుకుంటూ భారతదేశాన్ని ప్రపంచానికి గురువుగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. స్వయం సేవకులు దేశం పట్ల అపరిమితమైన భక్తి భావాన్ని కలిగి ఉండాలని, నిత్యం సమాజ ఉన్నతి కోసం తాను సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని దేశం కోసం వెచ్చించాలని సూచించారు. దేశం తీవ్రవాదం అనే పెనుముప్పును ఎదుర్కొంటోందని, ముఖ్యంగా క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే యువత దేశ సమైక్యత కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు ఏలేటి నారాయణరెడ్డి, మోర్తాడ్ ఖండ్ సహ ప్రముఖ్ కైరి దశాగౌడ్, సత్యంరెడ్డి, వెంకట్‌రెడ్డి, నరేష్, అన్నారెడ్డి, కిశోర్, గంగారాం, మురళీశంకర్, జీవన్, దయానంద్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.