నిజామాబాద్

ఒకే రోజు లక్ష మొక్కలు నాటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీపేట, జూలై 5: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంపై డిఎల్‌పిఓ శ్రీకాంత్ మంగళవారం నవీపేట మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 8వ తేదీ నుండి ప్రారంభమయ్యే హరితహారం కార్యక్రమానికి మండలంలోని ప్రతి గ్రామంలో 6, 7వ తేదీల్లోగా గుంతలు తవ్వించి సిద్ధంగా ఉంచాలని ఇజిఎస్ అధికారులకు సూచించారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రార్థనా మందిరాలు, మైదానాలు, రోడ్లకు ఇరువైపులా ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీయించి సిద్ధంగా ఉంచేలా ఫీల్డ్‌అసిస్టెంట్లకు ఆదేశాలు జారీ చేయాలని ఎపిఓకు సూచించారు. 8వ తేదీ ఒక్కటే రోజున లక్ష పైచిలుకు మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఒక్కో గ్రామంలో 40వేల చొప్పున మండలంలో 9లక్షల మొక్కలు నాటించాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపిడిఓ సాదీక్‌అలీ, ఎపిఓ సునీత, సూపరింటెండెంట్ శ్రీనివాస్‌రెడ్డి, ఇజిఎస్ టెక్నికల్ అసిస్టెంట్ల తదితరులు పాల్గొన్నారు.