నిజామాబాద్

గ్రామ సంఘాలకు మొక్కల సంరక్షణ బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 19: హరితహారం కింద నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ఈ బాధ్యతను గ్రామ సంఘాలకు అప్పగిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40వేల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తున్నామని, ఇప్పటికే 40గ్రామాల్లో మొక్కల సంరక్షణ బాధ్యతలను సంబంధిత గ్రామ సంఘాలకు అప్పగించామని పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మలు జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మొక్కల సంరక్షణకు చేపడుతున్న చర్యల గురించి కలెక్టర్ యోగితారాణా వారి దృష్టికి తెచ్చారు. జిల్లాలో హరితహారం అమలును పరిశీలించేందుకు హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ కూడా ఇక్కడి నుండే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొక్కల సంరక్షణ కోసం నిజామాబాద్ జిల్లాలో అమలు చేస్తున్న ప్రణాళిక ఎంతో భేషుగ్గా ఉందని ప్రశంసించారు. గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉన్న అన్ని రకాల భూముల్లో మొక్కలు నాటుతున్నారని, సగటున ప్రతిరోజు 14లయల మొక్కలు నాటుతున్నారని ప్రధాన కార్యదర్శికి వివరించారు. స్థానికంగా ఉన్న తుమ్మ కంపలను నరికి మొక్కలకు కంచెలు ఏర్పాటు చేస్తున్నారని, పలితంగా మొక్కలను పశువులు మేయకుండా కాపాడినట్లవుతోందని, ప్రతి మొక్కను పరిరక్షించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్న తీరు ఎంతో బాగుందని అన్నారు. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు కంచెలు ఏర్పాటు చేయడంతో పాటు క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ వాటిని సంరక్షించే పనులకు ఉపాధి హామీ కింద ఇచ్చే డబ్బులను గ్రామ సంఘాలకు విడుదల చేస్తామని కలెక్టర్ సిఎస్ దృష్టికి తెచ్చారు.