నిజామాబాద్

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, జూలై 19: గడిచిన రెండుమూడు సంవత్సరాల్లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల నుండి గట్టెక్కేందుకు ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు పర్యావరణ సమతూల్యతను పెంచేందుకు నడుంభిగించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం బాన్సువాడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. బాన్సువాడ పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో సుమారు 2వేల మొక్కలు నాటిన అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తమవంతు బాధ్యతగా స్థానిక జర్నలిస్టులంతా ఐక్యంగా 2000 మొక్కలు నాటేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటించిన ప్రెస్‌క్లబ్ ప్రతినిధులందరిని ఈ సందర్భంగా పోచారం అభినందించారు. దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ మొత్తం విస్తీర్ణంలో 35శాతం అటవీ ఉండాలని, అప్పుడే విరివిగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని పేర్కొన్నారు. అయితే మన రాష్ట్రం విషయానికి వస్తే కేవలం 21శాతం మాత్రమే అడవులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయని, వాస్తవంగా ఇది 18శాతమే ఉండవచ్చన్నారు. దీంతో గడిచిన రెండుమూడు సంవత్సరాలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని, భూగర్భ జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పటికే నిత్యాసరాల కోసం నీటిని కొనుగోలు చేసి వినియోగించాల్సిన పరిస్థితి నెలకొందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రాణవాయువును సైతం డబ్బులు పెట్టి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. ఇందుకు ప్రధాన కారణం అడవులను విచ్చలవిడిగా నరికివేయడమేనని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం పెంచేందుకు గాను తెలంగాణకు హరితహారం అనే మహాయజ్ఞంను ప్రారంభించారని పేర్కొన్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో అడవుల శాతం అతితక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు కురియకపోవడం వల్ల సాగు, తాగునీటి ఇక్కట్లను ఎదుర్కొంటున్నామని అన్నారు. అదే ప్రక్క జిల్లాలైన ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని అన్నారు. ఇందుకు కారణం ఆ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండటం వల్ల మేఘాలు ఆ ప్రాంతాలను వర్షం రూపంలో ముద్దాడిపోతున్నాయని పేర్కొన్నారు. హరితహారంలో మొక్కలు నాటిన విద్యార్థిని, విద్యార్థులు తమతమ నివాస ప్రాంతంలో, వీధుల్లో ఒక్కొక్కరు కనీసం 12మొక్కల చొప్పున నాటాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించుకున్నప్పుడే హరితహారం కార్యక్రమం లక్ష్యం నెరవేరుతుందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం నాటుతున్న మొక్కలన్ని పెరిగి చెట్లుగా ఎదిగితే, రాబోయే తరాలకు తాగు, సాగునీటి ఇక్కట్లు అనేవి ఉండవని మంత్రి తెలిపారు. బాన్సువాడ పట్టణంలోని ప్రధాన రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్‌పై మంత్రి పోచారం చైనా బాదాం మొక్కలను నాటారు. ఈ మొక్కలు వాహనాల నుండి వెలువడే కాలుష్యాన్ని పీల్చుకుని, స్వచ్ఛమైన ఆక్సిజన్‌లు విడుదల చేస్తాయని అన్నారు.
బాన్సువాడ పట్టణంలో హరితహారంపై మంత్రి అసంతృప్తి
ఇదిలాఉండగా, నియోజకవర్గ కేంద్రమైన బాన్సువాడలో 40వేలకు పైచిలుకు జనాభా ఉండగా, హరితహారం కార్యక్రమంలో ఇప్పటి వరకు కేవలం 25వేల మొక్కలు మాత్రమే నాటించడంపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తన స్వగ్రామమైన పోచారంలో 1000మంది జనాభా ఉంటే, ఇప్పటికే 50వేల పైచిలుకు మొక్కలు నాటారని, తాను దత్తత తీసుకున్న సోమేశ్వర్ గ్రామంలో 1500జనాభా ఉండగా, 46వేల మొక్కలను నాటించడం పట్ల అక్కడి ప్రజాప్రతినిధులు, అధికారులపై మంత్రి ప్రశంసల జల్లులు కురిపించారు. అదే జిల్లాలోనే అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన బాన్సువాడలో కేవలం 25వేల మొక్కలు మాత్రమే నాటించారంటే ఇక్కడి గ్రామ పంచాయతీ సిబ్బంది, పాలకవర్గం పనితీరు ఏమిటో అర్థమవుతోందన్నారు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్‌తో పాటు పాలకవర్గం, అధికారులు మేల్కొని, నిర్ణీత గడువులో పెద్దఎత్తున మొక్కలు నాటించాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ దొన్కంటి వాణి, బోధన్ ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, డిఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్పీటిసి జంగం విజయ గంగాధర్, ఎంపిపి రేష్మాబేగం మహ్మద్ ఎజాజ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు అలీముద్దీన్‌బాబా, ఎఎంసి చైర్మన్ నార్ల సురేష్‌గుప్తా, తెరాస నాయకులు వై.కృష్ణారెడ్డి, డాక్టర్ అంజిరెడ్డి, గోపాల్‌రెడ్డి, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ నాగరాజు, నాగేందర్‌తో పాటు విద్యార్థులు, ప్రెస్‌క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.