నిజామాబాద్

ఆర్టీసీ ఎన్నికల్లో సత్తా చాటిన టిఎంయు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, జూలై 19: గడిచిన పక్షం రోజుల నుండి నిజామాబాద్ జిల్లాలో కొనసాగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల వేడి మంగళవారం నాటితో ముగిసింది. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు పోలింగ్ జరుగగా, తదనంతరం కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి ఫలితాలను వెల్లడించారు. ఈ ఎన్నికల్లో టిఎంయు తన సత్తాను చాటుకుంది. నిజామాబాద్ రీజియన్ పరిధిలో మొత్తం ఆరు డిపోలు ఉండగా, నిజామాబాద్-2 డిపో మినహా మిగతా ఐదు డిపోలలో టిఎంయు భారీ మెజార్టీతో విజయాలు నమోదు చేసింది. అయితే నిజామాబాద్-2 డిపోలో మాత్రం 13ఓట్ల ఆధిక్యతతో ఎంప్లాయిస్ యూనియన్ విజయం సాధించింది. ఎంప్లాయిస్ యూనియన్‌కు ఎన్‌ఎంయు, ఎస్‌డబ్ల్యుఎఫ్‌లు అండగా నిలిచినప్పటికీ, ఒంటరిగా పోటీ చేసిన టిఎంయు ఘన విజయం సాధించడంతో జిల్లాలోని ఆయా డిపోల వద్ద టిఎంయు నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఆరు డిపోల పరిధిలో మొత్తం 3064మంది ఓటు హక్కు కలిగిన కార్మికులు ఉండగా, వారిలో దాదాపు 3000మంది వరకు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తెలుస్తోంది. ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కార్మిక శాఖ అధికారులు ఆయా డిపోల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ పోలింగ్ ప్రక్రియను నిర్వహించారు.