నిజామాబాద్

తెరుచుకున్న రైల్వేగేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూలై 19: నగరంలోని కిసాన్‌గంజ్, శ్రద్ధానంద్ గంజ్‌లను కలిపే రైల్వేగేట్‌ను ఆ శాఖ అధికారులు మూసి వేయగా, రైల్వేగేట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో గడిచిన 19రోజులుగా రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. వీరి దీక్షలను అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు సందర్శించి సంఘీభావం ప్రకటించడంతో పాటు ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. అదే సమయంలో రైల్వేగేట్‌ను మూసి వేసిన విషయాన్ని జిల్లా ఎంపి కవిత, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన వారు రైల్వే శాఖ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో మంగళవారం రైల్వేగేట్‌ను తెరిచారు. రైల్వేగేట్ తెరుచుకోవడంతో గేటు పరిరక్షణ సమితి, వ్యాపారులు, ప్రజా సంఘాలు, ఆయా పార్టీల నాయకులు పెద్దఎత్తున బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఇందుకు సహకరించిన ఎంపి కవిత, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తాతో పాటు ఆందోళనకు మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సాయికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంబురాల్లో రైల్వేగేట్ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు భక్తవత్సలం, సీతారాం పాండే, సుఖం వ్యాస్, నాగరాజ్ పాల్గొన్నారు.