నిజామాబాద్

హరితహారం లక్ష్యాన్ని నెరవేర్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాక్లూర్, జూలై 19: కొంతమంది ప్రజాప్రతినిధులు పత్రికల్లో ఫోజులు ఇచ్చేందుకే హంగామా చేస్తున్నారే తప్ప, హరితహారం లక్ష్యాన్ని సాధించేందుకు చిత్తశుద్ధితో పని చేయడం లేదని, ఫలితంగా నిర్దేశించిన లక్ష్యం నీరుగారుతోందని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు ఈ వైఖరిని మానుకుని లక్ష్య సాధన కోసం పని చేయాలని సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎంపిపి ఛాంబర్‌లో ఉపాధి హామీ ఫీల్డ్‌అసిస్టెంట్లతో సమావేశమై హరితహారం కార్యక్రమంపై సూచనలు చేశారు. మాక్లూర్ మండలంలో 8లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం 2లక్షల మొక్కలు మాత్రమే నాటించడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ సిబ్బంది, అధికారులు మేల్కొని, 22వ తేదీలోగా నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. హరితహారం లక్ష్య సాధనలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది, అధికారులపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఉపాధి హామీ కూలీలు, ప్రజలతో పాటు ఎంపిడిఓ, తహశీల్, పోలీసు, ఇతర శాఖలు సైతం తమవంతు బాధ్యతగా హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం సర్పంచ్‌లతో సమావేశమైన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, హరితహారం లక్ష్యాన్ని సాధించిన వారికే, ఆ గ్రామాల అభివృద్ధికి నిధులను కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అనంతరం మండలంలోని ఒడ్యాట్‌పల్లి గ్రామానికి చెందిన పంగరి చిరంజీవికి 14,500, నడ్పి గంగారాంకు 62,400రూపాయల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి శిరీషా, జడ్పీటిసి లత, నాయకులు రజినీష్, సత్యం, రాజ్ మల్లయ్య పాల్గొన్నారు.