నిజామాబాద్

జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్దరణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డి, జూలై 19: తెలంగాణ రాష్ట్రంలో జీర్ణావస్థలోఉన్న దేవాలయాల పునరుద్దరణ కోసం టిటిడి తరపున నిధులు మంజూరుతొపాటు, తిరుమల తిరుపతి దేవస్థానంలోశ్రీవేంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ విగ్రహాన్ని సామాన్య భక్తులకు తక్కువ సమయంలోదర్శనం కలిగే విధంగా అన్ని రకాలచర్యలుతీసుకుంటున్నామని, టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డు సభ్యులు, జిల్లాటిడిపి అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణానికి టిడిడి బోర్డు సభ్యునిగా నియామకైన తర్వాత మొట్టమొదటి సారిగా వచ్చిన సందర్భంగా పార్టీ కార్యాలయంలో టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ఒడ్డెపల్లి సుభాష్‌రెడ్డి శాలువాకప్పి, పూలమాలలతోఘనంగా సత్కరించారు. ఈసందర్భంగా అరికెల నర్సారెడ్డిమాట్లాడుతూ, ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో టిటిడి కళ్యాణ మండపం నిర్మాణం కోసం చర్యలుతీసుకుంటామన్నారు. టిటిడి నిబంధనల ప్రకారం 40 శాతం నిధులు కడ్తె మిగితానిధులను టిటిడి భరించి నిర్మిస్తుందన్నారు. జిల్లాలో మొత్తం 12 టిటిడి కాళ్యాణ మండపాలు ఉన్నాయని, వాటిలో 4 మాత్రమే నడుస్తున్నాయన్నారు. మిగితావి నడవటం లేదన్నారు. ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి మొత్తం 230 టిటిడి కళ్యాణ మండపాలు ఉండగా వీటిలో కేవలం 80 మాత్రమే నడుస్తున్నాయన్నారు. నడవని కళ్యాణ మండపాలను, మరమ్మత్తులు చేసి, మిగితావాటిని డ్వాక్రా మహిళలు ముందుకు వస్తే వారికి నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పెలా బోర్డు సమావేశంలోచర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆలయాల వద్దఉన్న టిటిడి మండపాలకు ఆలయ నిర్వహకులకు అప్పచేప్తామన్నారు. జిల్లాలో2,3 ఉన్నాయన్నారు. సిద్దిరామేశ్వరాలయం వద్ద ఉన్నమండపాన్ని ఆలయానికి నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పామన్నారు. జిల్లాకేంద్రంలోఅన్నమయ్య భవనం నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేయడం జరిగిందని, బోర్డు సమావేశంలోచర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లాకేంద్రంలోఉన్న టిటిడి ఆన్‌లైన్ సేవలను, కామారెడ్డి డివిజన్ కేంద్రంలో ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు చేసి, ఏర్పాటుకోసం నిర్ణయం తీసుకోవడం జరుగుతోందన్నారు. ఈసమావేశంలోటిడిపి మండల పార్టీ అధ్యక్షులు నాగం పరందాములు, ధనుంజయ్, బద్దలక్ష్యయ్య, నాయకులు గయాజుద్దిన్, రాజ్‌దాస్ శ్రీనివాస్‌రెడ్డి, కంచం రాములు, నాయిని సాయిరాం, ఝలందర్‌రెడ్డి ,జనార్థన్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, సాయిరెడ్డి తదితరులు ఉన్నారు.