నిజామాబాద్

చెట్లను నరకడం ఆపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివనగర్, జూలై 19: చెట్లను నరకడం ఆపి మొక్కలను సంరక్షించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్మిత సబర్వాల్ అన్నారు. మంగళవారం మండలంలోని కుప్రియాల్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను ఆమెతో పాటు జిల్లా కలెక్టర్ యోగితారాణా పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటిన అనంతరం ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం భావితరాలు బాగుండాలనే ఉద్దేశ్యంతో పెట్టిందన్నారు. చెట్లు ఉంటేనే వర్షాలు కురుస్తాయని తెలిపారు. గ్రామంలో నాటిన మొక్కలపై సంతృప్తి వ్యక్తం చేశారు. లక్ష్యానికి మించి మొక్కలు నాటి, వాటిని సంరక్షించుకోవాలన్నారు. ఈ పథకం అమలుపై ప్రభుత్వానికి నివేదికలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ కమిషనర్ ప్రియాంక్, జెసి రవిందర్‌రెడ్డి, ఆర్‌డిఓ నగేశ్, ఎంపిపి బంజ విజయశివకుమార్, జడ్పిటిసి రాజేశ్వర్‌రావు, సర్పంచ్ స్వరూపభూంరెడ్డి, పార్టీ మండల కార్యదర్శి భాస్కర్, తహశీల్దార్ అమీన్‌సింగ్, ఎపిఎం సాయిలు, ఎఓ రాజలింగం, ఎంపిటిసి రవిందర్‌రెడ్డి, ఎఫ్‌ఎ నాగరాజు, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.