నిజామాబాద్

గంజాయి ఘాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 19: జిల్లాను కేంద్ర బిందువుగా మల్చుకుని మహారాష్టక్రు పెద్దఎత్తున గంజాయి అక్రమ రవాణా జరుగుతోంది. ఈ విషయం ఇప్పటికే పోలీసుల దాడులతో స్పష్టమైనప్పటికీ, గంజాయి రవాణాను నిరోధించడంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం నిద్రమత్తును వీడడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కల్తీ పేరిట కల్లు డిపోలపై విరివిగా దాడులు నిర్వహిస్తున్న ఆబ్కారీ అధికారులు, గంజాయి ఘాటు గురించి అసలేమాత్రం పట్టించుకోకపోవడం చర్చనీయాంశమవుతోంది. గంజాయిని నిరోధించే బాధ్యత ఒక్క ఎక్సైజ్ శాఖదే కాదని, ఇతర శాఖలు కూడా గంజాయి నిల్వల గురించి తెలిస్తే దాడులు నిర్వహించవచ్చంటూ ఎక్సైజ్ అధికారులు తప్పించుకునే యత్నాలకు పాల్పడుతున్నారు. నిజానికి గత దశాబ్ద కాలం క్రితం వరకు కూడా నిజామాబాద్ జిల్లాలో గంజాయి సాగు పెద్దఎత్తున కొనసాగేది. ఏకంగా ప్రభుత్వ అసైన్డ్ స్థలాలు, అటవీ భూములను సైతం ఆక్రమించుకుని జొన్న, మొక్కజొన్న పంటలతో కలిపి అంతర పంటగా గంజాయిని సాగు చేసేవారు. మహారాష్టక్రు చెందిన స్మగ్లర్లు ‘శీలవతి’ వంటి నాణ్యమైన గంజాయి విత్తనాలను సమకూరుస్తూ పలు తండాలకు చెందిన గిరిజనులచే గంజాయిని సాగు చేయించేవారు. ఆ సమయంలో ఎక్సైజ్ అధికారులు ఇతర వ్యాపకాలను పక్కనబెట్టి పూర్తిగా గంజాయి సాగును అరికట్టే అంశంపైనే దృష్టిని కేంద్రీకరించే వారు. పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో దట్టమైన అటవీ ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకెళ్తూ గంజాయి సాగును నిరోధించడంలో సఫలీకృతులయ్యారు. అయితే ప్రస్తుతం జిల్లాలో గంజాయి సాగు పూర్తిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గంజాయి రవాణాకు ఇందూరు కేంద్ర బిందువుగా నిలుస్తుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. కరీంనగర్, వైజాగ్ తదితర ప్రాంతాల నుండి నిజామాబాద్ మీదుగా మహారాష్టల్రోని నాసిక్, పూణె, నాందెడ్, ముంబై తదితర ప్రాంతాలకు యథేచ్ఛగా గంజాయిని రవాణా చేస్తున్నారు. స్థానికంగా కూడా పలుచోట్ల గుట్టుగా గంజాయి సాగు చేపడుతుండడమే కాకుండా, ఈ ప్రాంతానికి చెందిన కొందరు యువకులు గంజాయి రవాణాలో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. గంజాయి స్మగ్లింగ్‌ను నిరోధించేందుకు పాత పద్ధతిలోనే వాటి రవాణాదారుల సమాచారాన్ని సేకరించి, గట్టి నిఘాను కొనసాగించాల్సిన ఎక్సైజ్ అధికారులు, నామ్‌కే వాస్తేగా దాడులు నిర్వహించడంతోనే సరిపెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పెద్దఎత్తున గంజాయి నిల్వలు పట్టుబడిన సంఘటనలన్నీ పోలీసు శాఖ దాడులు నిర్వహించినవే ఉంటున్నాయి. ఇటీవలే ఢిల్లీకి చెందిన గంజాయి స్మగ్లింగ్ ముఠా నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు వ్యక్తుల వద్ద నుండి సుమారు 200కిలోల గంజాయిని తరలిస్తుండగా, పక్కా సమాచారంతో రూరల్ పోలీసులు నిఘాను కొనసాగించి గంజాయి స్మగ్లింగ్ గ్యాంగ్ గుట్టును రట్టు చేశారు. దీనికి కొద్దిరోజుల ముందు బడాపహాడ్ అటవీ ప్రాంతం మీదుగా కారులో తరలిస్తున్న గంజాయి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా శాంతి భద్రతల పరిరక్షణ విధుల్లో నిమగ్నమై ఉంటూనే పోలీసు శాఖ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతుండగా, ఆ తరహా చొరవ ఆబ్కారీ శాఖ నుండి మాత్రం కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయ. ఎక్కడైనా దాడులు చేసినా, ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా స్వల్ప మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోనే సరిపెట్టుకుంటున్నారు. గత రెండు నెలల క్రితం బాల్కొండ మండలం దూద్‌గాం వద్ద కారులో అక్రమంగా రవాణా చేస్తున్న 135కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి కొద్దిరోజుల ముందు ఇందల్వాయిలోని టోల్‌ప్లాజా వద్ద పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టగా, నాలుగు బస్తాల గంజాయి లభ్యమైంది. అనంతరం ఎక్సైజ్ అధికారులు గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకున్న దాఖలాలు లేకుండాపోయాయి.