నిజామాబాద్

మరింత పచ్చదనాన్ని పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిచ్‌పల్లి రూరల్, జూలై 19: హరితహారం కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు మంగళవారం జిల్లాకు హాజరైన ముఖ్యమంత్రి కార్యాలయ అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్ డిచ్‌పల్లిలోని టిఎస్‌ఎస్‌పి 7వ పోలీసు బెటాలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బెటాలియన్ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలుకగా, బెటాలియన్ ఆవరణలో హరితహారం కార్యక్రమానికి ఒఎస్‌డిగా వ్యవహరిస్తున్న ప్రియాంకవర్గీస్‌తో కలిసి స్మితాసబర్వాల్ మొక్కలు నాటారు. బెటాలియన్ పరిసరాలన్నీ ఇప్పటికే విరివిగా చెట్లతో పచ్చదనంతో నిండి ఉండడాన్ని గమనించి బెటాలియన్ అధికారులను అభినందించారు. బెటాలియన్‌కు విశాలమైన ఖాళీ స్థలం ఉన్నందున హరితహారంలో భాగంగా పెద్దఎత్తున మొక్కలు నాటి మరింత పచ్చదనాన్ని పెంపొందించాలని ఆమె సూచించారు. సిఎంఓ అదనపు కార్యదర్శి వెంట కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, జె.సి రవీందర్‌రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.