నిజామాబాద్

రైతులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూలై 22: నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డును ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసినందున, రాష్ట్ర ప్రభుత్వం పసుపు రైతులకు బేషరతుగా క్షమాపన చెప్పాలని డిసిసి అధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంపి కల్వకుంట్ల కవిత, జిల్లాలోని ఆర్మూర్ మండలంలో పసుపు బోర్టు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను కోరడం జరిగిందని గొప్పలు చెప్పుకున్నారని, తీరా గురువారం కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డును ఏర్పాటు చేయలేమని స్పష్టం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే జిల్లా రైతులు పసుపును సాంగ్లీ మార్కెట్‌కు తరలిస్తున్నారని, జిల్లాకు పసుపు బోర్డు రాకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ కలుగజేసుకుని, వెంటనే ఆర్మూర్‌లో పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.