నిజామాబాద్

అడవులుంటేనే వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిట్లం, జూలై 22: వర్షం భగవంతుడి వరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. భగవంతుడు చెట్లకు, వర్షానికి సంబంధం పెట్టాడని, అడవుల ఎక్కువ శాతం ఉన్నచోటే అధికంగా వర్షాలు కురుస్తాయని అన్నారు. శుక్రవారం ఆయన పిట్లం మండలం తిమ్మానగర్ గ్రామంలో జరిగిన వ్యవసాయ దినోత్సవంలో పాల్గొని మొక్కలు నాటారు. హరితహారంలో భాగంగా వ్యవసాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ శాఖ ఆధ్వర్యంలో 2.50కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ మొక్కలను రైతుల పంట పొలాల్లోని గెట్లపై గానీ, బీడు భూముల్లో గానీ నాటేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. హరితహారం కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. కలెక్టర్ యోగితారాణా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇందుకుగాను మంత్రి పోచారం కలెక్టర్‌తో పాటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఏ ప్రాంతంలోనైనా 35శాతం అడవులు ఉంటేనే సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని అన్నారు. ఈ లెక్కన మన రాష్ట్రంలో 230కోట్ల మొక్కలు నాటితే 35శాతం అటవీ విస్తీర్ణం భర్తీ అవుతుందన్నారు. కడుపు నిండాలంటే రైతు బతకాలని, రైతులు బతకాలంటే సమృద్ధిగా వర్షాలు కురియాలని, వర్షం కురియాలంటే చెట్లు ఉండాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఒక్క రోజు మనిషి ప్రాణవాయువును కొనుగోలు చేయాలంటే కనీసం సుమారు 2100రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని మంత్రి తెలిపారు. అలాంటిది చెట్లు మాత్రం నయాపైసా ఖర్చు లేకుండా ప్రాణవాయువును అందిస్తుందన్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి అనేక సంక్షేమ పథకాలు చేపడుతోందని, కానీ, డబ్బులు వెచ్చిస్తే వర్షాన్ని మాత్రం కొనుగోలు చేయలేమని మంత్రి తెలిపారు. వర్షం కురియాలంటే తప్పనిసరిగా మొక్కలు నాటాల్సిందేనని అన్నారు. ప్రతి ఒక్కరు కనీసం 15మొక్కలు నాటాలని, వాటిని పరిరక్షించేందుకు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం మంత్రి తిమ్మానగర్ సింగిల్ విండో ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్‌షిండే, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, డిసిసిబి చైర్మన్ గంగాధర్‌రావు పట్వారీ, ఎంపిపి రజినీకాంత్‌రెడ్డి, జడ్పీటిసి ప్రతాప్‌రెడ్డి, వైఎస్ ఎంపిపి నర్సాగౌడ్, అన్నారం వెంకట్రాంరెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.