నిజామాబాద్

టిఎస్‌ఆర్‌టిసిని ఉన్నత స్థాయికి తేవడమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, జూలై 22: ఆర్టీసీ సంస్థను ఉన్నత స్థాయికి చేర్చడమే లక్ష్యమని, ఈ దిశగా డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు, సిబ్బంది అందరూ అంకితభావంతో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ సంస్థ చైర్మెన్ సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో-1లో ఉత్తమ ఉద్యోగుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్మెన్ మాట్లాడుతూ, డ్రైవర్లు, కండక్టర్లు మెరిట్‌ని నిరూపించుకుంటున్నందున ఆర్టీసీని అభివృద్ధి పథంలోకి పయనింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. గతేడాది ఆర్టీసీ 700కోట్లకు పైగా నష్టాల్లో ఉండిందని, ఈ ఏడాదిని ఆ నష్టాన్ని 270కోట్లకు తగ్గించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పటైన మీదట ఆర్టీసీలో పని చేస్తున్న వారందరూ శ్రద్ధగా పని చేయడమే నష్టాల తగ్గింపునకు కారణమని అన్నారు. అయితే మరింత అంకితభావంతో పని చేస్తూ సంస్థకు లాభాలు సమకూరేలా చేయాలని ఆయన పిలుపున్చారు. ప్రధానంగా వాహన వినియోగాన్ని, ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని హితవు పలికారు. పల్లె వెలుగు బస్సులను అధికంగా గ్రామాల్లో నడపాల్సిన అవసరం ఉందని, వీటిని నడిపితేనే ఆర్టీసీ లాభాల బాట పడుతుందన్నారు. నిజామాబాద్ డిపో-1, డిపో-2లు లాభాల బాటలో ముందంజలో ఉన్నాయని, మిగతా డిపోలు మాత్రం ఇదే బాటలో ఎందుకు పయనించడం లేదో అర్థం కావడం లేదన్నారు. నష్టాన్ని పూడ్చుకునేందుకు కొంత వరకు చార్జీలు పెంచడం జరిగిందని, కానీ దీనిపై కాంగ్రెస్ రాద్ధాంతం చేయడం శోచనీయమన్నారు.ఆర్టీసీ బస్సులలో ప్రయాణం ఎంతో సురక్షితంగా ఉంటుందని, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణిస్తూ సంస్థకు తోడ్పాటును అందించాలన్నారు. కండక్టర్లు, డ్రైవర్లు సమయపాలనను పాటించినప్పుడే ఆర్టీసీపై ప్రజల్లో నమ్మకం కలుగుతుందన్నారు. జీతాలు పెరగాలంటే ఆర్టీసీకి లాభాలు సమకూరాలని, ఇది కండక్టర్, డ్రైవర్లపై ఆధారపడి ఉందన్నారు. 1157 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని, ఇందులో 600 గరుడ బస్సులు కాగా, మిగతావి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటాయన్నారు. ఇ-టెండర్ ద్వారానే నూతన బస్టాండ్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఆర్టీసీ కార్మికులకు 44శాతం ఫిట్‌మెంట్‌ను ఇవ్వడం జరిగిందని, కాబట్టి డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు 90శాతం పని చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, తనను ఆర్టీసీ చైర్మెన్‌గా నియమించినందున ఆర్టీసీ సంస్థను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అహరహం శ్రమిస్తున్నట్టు తెలిపారు. నిజామాబాద్ నుండి ముంబైకు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిపించడం లేదని విలేఖరులు చైర్మెన్ దృష్టికి తేగా, త్వరలోనే ముంబై రూట్‌లో బస్సు సర్వీసును ప్రవేశపెడతామని, అదేవిధంగా నిజామాబాద్ నగరంలో సిటీ బస్సులను కూడా నడుపుతామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఉత్తమ డ్రైవర్లు, కండక్టర్లకు నగదు పురస్కారలతో ఘనంగా సన్మానించారు. డిపో-1 ఆవరణలో హరితహారంలో భాగంగా ఆర్టీసీ అధికారులు, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. నిజామాబాద్-తిరుపతి మార్గంలో నూతనంగా ప్రవేశపెట్టిన గరుడ ప్లస్ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్‌ఎం ఖుస్రోషాఖాన్, డిప్యూటీ సిఎంఇ దైవాధీనం, ప్రకాష్‌రావు, రమేష్‌తో పాటు ఆయా డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.