నిజామాబాద్

గడవు పూర్తయినా... లక్ష్యం నెరవేర్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాన్సువాడ, జూలై 22: హరితహారం కార్యక్రమం ఈ నెల 22వ తేదీతో ముగిసినప్పటికీ, ఆయా గ్రామాలకు ఇచ్చిన టార్గెట్లను పూర్తి చేసే వరకు మొక్కలు నాటించాల్సిందేనని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం బాన్సువాడ ప్రధాన రోడ్డులోని డివైడర్ మధ్య మంత్రి మొక్కలను నాటారు. అనంతరం పట్టణంలోని టీచర్స్ కాలనీ, సిందూ విద్యాలయం ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి పెద్దఎత్తున మొక్కలు నాటించిన వార్డు సభ్యుడు శ్రీనివాస్‌ను ఈ సందర్భంగా మంత్రి పోచారం అభినందించారు.
అనంతరం మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 15రోజుల పాటు హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు, విద్యార్థులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటించాలని ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు హరితహారం కార్యక్రమాన్ని కొనసాగించాలని మంత్రి సూచించారు.
హరితహారంలో నిజామాబాద్ జిల్లా గురువారం వరకు 2.10కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఇందులో అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధి హామీ కూలీల కృషి ఎంతో ఉందన్నారు. జిల్లాలో 3.35కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించగా, టార్గెట్‌ను మించి మొక్కలు నాటేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సమిష్టిగా కోరారు. అలాగే నాటిన మొక్కలన్నింటిని కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొక్కల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేసుకుని, సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనం వచ్చే వరకు హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. 35శాతం అడవుల విస్తీర్ణం వచ్చే హరితహారాన్ని కొనసాగించాలని, తద్వారా భవిష్యత్‌లో పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని అన్నారు.