నిజామాబాద్

వైజాగ్ టు అకోలా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, ఆగస్టు 4:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం కేంద్రంగా మహారాష్టల్రోని అకోలాకు పెద్ద ఎత్తున గంజాయి రవాణా జరుగుతోంది. ఐదుగురు సభ్యులు గల ముఠా సభ్యులు ఈ గంజాయి రవాణా చేస్తున్నారు. ఈ గంజాయి రవాణాకు కామారెడ్డి డివిజన్‌లోని ఇద్దరు వ్యక్తులు అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తూ గంజాయిని మహారాష్టక్రు తరలిస్తున్నారు. హైటెక్ పద్ధతిలో సాగుతున్న గంజాయి రవాణాకు బోధన్ పోలీసులు ఎట్టకేలకు కళ్లెం వేశారు. బోధన్ సబ్‌డివిజన్‌లోని వర్ని మండలం బడాపహాడ్ వద్ద గతంలో పోలీసులకు గంజాయి రవాణా చేస్తూ విజయలక్ష్మి పట్టుబడగా రూరల్ పోలీసులు ఆమె పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సదరు మహిళను విచారించగా ఈ గంజాయి వ్యాపారానికి సంబంధించి ముఠా సభ్యుల వివరాలు బయట పడ్డాయి. గురువారం బోధన్ డిఎస్పీ వెంకటేశ్వర్లు విలేఖరుల సమావేశంలో ఈ ముఠా సభ్యుల వివరాలు వెల్లడించారు. వైజాక్‌కు చెందిన శ్రీనాథ్, వీరన్న, సుబ్బు, జ్యోతి, విజయలక్ష్మిలు ముఠాగా ఏర్పడి కొంతకాలం నుండి గంజాయిని ఎండబెట్టి మహారాష్టక్రు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ గంజాయిని వారు ఎంచక్కా ఎండబెట్టి అక్కడే పొడిగా చేసి ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి కామారెడ్డి డివిజన్‌లోని గాంధారి మండలం టేక్మాల్ తండాకు చెందిన మదన్‌సింగ్‌కు, ఉగ్రవాయి గ్రామానికి చెందిన అరుణ్‌కు సరఫరా చేసేవారు. వీరిద్దరు ఈ గంజాయి పౌడర్‌ను మహారాష్టల్రోని అకోలాకు తరలించేవారు. వీరిలో వైజాక్‌కు చెందిన వీరన్న, మదన్‌సింగ్, అరుణ్‌లను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్పీ వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో బోధన్ రూరల్ సిఐ శ్రీనివాసులు, బోధన్ ఎస్‌హెచ్‌వో వెంకన్నలు పాల్గొన్నారు.