నిజామాబాద్

ఇ-నామ్ మార్కెట్లలో రూ. 90కోట్ల విక్రయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, ఆగస్టు 4: జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానం(ఇ-నామ్)కు ఇటీవల అనుసంధానమైన రాష్ట్రంలోని ఆయా మార్కెట్లలో 90కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సి.పార్థసారథి తెలిపారు. ఇ-నామ్‌కు అనుసంధానమైన వాటిలో నిజామాబాద్‌తో పాటు భాగేపల్లి, వరంగల్, మలక్‌పేట, తిరుమలగిరి మార్కెట్ యార్డులు ఉన్నాయని అన్నారు. సదరు మార్కెట్ యార్డులలో ఇ-బిడ్డింగ్ ద్వారా 90కోట్ల రూపాయల వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయని, రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లభించేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తోందని ఆయన పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా గురువారం ఆయన నిజామాబాద్ మార్కెట్ యార్డు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి మాట్లాడుతూ, ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతోందని చెప్పారు. ఇందులో భాగంగానే నాబార్డు సహకారంతో వేయి కోట్ల రూపాయలను వెచ్చిస్తూ 17లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 330 గిడ్డంగులను నిర్మిస్తోందని వివరించారు. జాతీయ స్థాయిలో నామ్ కింద 214 మార్కెట్ కమిటీలను తీసుకుంటే, అందులో తెలంగాణ రాష్ట్రానికి చెందినవని 44మార్కెట్ యార్డులు ఉన్నాయన్నారు. మొదటి దశలో 21ఎఎంసిలకు గాను వాటిలో తెలంగాణకు చెందినవే ఐదు ఉన్నాయని తెలిపారు. వచ్చే అక్టోబర్ నాటికి రాష్ట్రంలోని 44ఎఎంసిలు నామ్‌కు అనుసంధానం అవుతాయని అన్నారు. మార్కెట్ యార్డుకు వచ్చే ప్రతీ వాహనాన్ని గేట్ ఎంట్రీ సిస్టం ద్వారా సునిశిత పర్యవేక్షణ జరిగేలా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. రైతుబంధు పథకం కింద మార్కెట్ యార్డు గిడ్డంగులలో పంట ఉత్పత్తులను నిలువ చేసుకునే రైతులకు ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు రుణ సదుపాయం కల్పిస్తోందన్నారు. గతంలో ఇది లక్ష రూపాయల వరకే ఉండేదని, ప్రస్తుతం ఆ రుణ పరిమితిని 2లక్షల రూపాయలకు పెంచడం జరిగిందన్నారు. రైతు బంధు రుణంపై 6నెలల వరకు ఎలాంటి వడ్డీ ఉండదని, గడువు దాటిన తరువాత కూడా నామమాత్రపు వడ్డీ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, 78ఎకరాల విస్తీర్ణం కలిగిన నిజామాబాద్ మార్కెట్ యార్డు ఆవరణలో గిడ్డంగులు, కార్యాలయాలు, యార్డుల మధ్యన గల ఖాళీ స్థలాల్లో బ్లాకుల వారీగా నాటిన టేకు, మామిడి మొక్కలను ఆయన పరిశీలించారు. మార్కెటింగ్ శాఖకు ప్రభుత్వం 10లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటివరకు 9.10లక్షల మ్కొలను నాటామని ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి వివరించారు. రాష్ట్రంలోని 180 మార్కెట్ యార్డులు, 340 సబ్ యార్డులు, 330 గోడౌన్ల ఆవరణల్లో వీటిని నాటామన్నారు. రెండు సంవత్సరాల వయస్సు ఉన్న మొక్కలు, అంట్లు తీసుకుని హరితహారంలో నాటుతున్నామని తెలిపారు. గతేడాది 4.5లక్షల మొక్కలు నాటగా, వాటిలో 90శాతం వరకు మొక్కలు బతికాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయా బ్లాకులలో నాటిన మొక్కల సంరక్షణ కోసం డ్రిప్ పద్ధతిలో వాటికి నీటిని అందించనున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ గురుతర బాధ్యతగా భావిస్తూ తప్పనిసరిగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి కోరారు.
కాగా, విత్తనోత్పత్తిలో రాష్ట్రం స్వయం సమృద్ధిని సాధించేలా బైబ్యాక్ పాలసీతో విత్తనాలను సాగు చేసే రైతులకు ప్రభుత్వం పూర్తి సహాయ, సహకారాలు అందిస్తోందని పార్థసారథి తెలిపారు. గురువారం ఆయన ఆర్మూర్, ఆలూర్, మిర్దాపల్లి, రాంపూర్ ప్రాంతాల్లో సోయా విత్తన క్షేత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర రైతులకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను మన రైతులతోనే పండించి, 2017 నుండి మన పొలాల్లోనే వాటిని విత్తనాలుగా అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌లో 4.75లక్షల క్వింటాళ్లు, రబీలో 2.63లక్షల క్వింటాళ్లు కలుపుకుని మొత్తం 7.38లక్షల క్వింటాళ్లకు పైగా విత్తనాలను పండించాలని లక్ష్యంగా నిర్దేశించిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ, హాకా సంస్థల ద్వారా విత్తనోత్పత్తికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.