నిజామాబాద్

123జీవో రద్దు మల్లన్నసాగర్ భూనిర్వాసితుల విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఆగస్టు 4: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు బుధవారం 123జీవోను రద్దు చేయడం మల్లన్నసాగర్ భూనిర్వాసితుల విజయం అని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు వేల్పూర్ భూమయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణ కోసం జీవో నెంబర్ 123ను తీసుకువచ్చి, రైతుల నుండి భూసేకరణ చేపట్టారని అన్నారు. దీంతో రైతులు గత కొంతకాలంగా ఆందోళనలు చేపట్టడం జరిగిందని, ఇందుకు స్పందించిన హైకోర్టు 123జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించడం ముమ్మాటికి మల్లన్నసాగర్ రైతుల విజయమేనని అన్నారు. ప్రజా, రైతు వ్యతిరేక జీవో నెంబర్ 123ను రద్దు చేసిన హైకోర్టు తెరాస ప్రభుత్వం తీరుపై మొట్టికాయలు వేసినా, ఉన్నత న్యాయస్థానానికి వెళ్లి అప్పీల్ చేస్తామని ప్రభుత్వం బీరాలు పలకడంలో అర్థంలేదన్నారు. మల్లన్నసాగర్ రైతుల భూములను గుంజుకోవడం గాని, బాధిత రైతులను పట్టించుకోకపోవడం గాని చేస్తే ఊరుకునేదిలేదన్నారు. సిఎం కెసిఆర్ దొరల పాలనను కొనసాగించడం మానుకుని, ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా సర్కార్ తన వైఖరిని మార్చుకుని 2013చట్టం ప్రకారం భూనిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.