నిజామాబాద్

కళకళలాడుతున్న వరద కాల్వలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల్కొండ, ఆగస్టు 4: రాష్ట్రంలోని భారీ ప్రాజెక్టుల్లో ఒకటైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్‌కు చెందిన ప్రధాన కాల్వలైన కాకతీయ, సరస్వతి, లక్ష్మి కెనాల్‌తో పాటు వరదకాల్వకు నీటి విడుదల కొనసాగుతోంది. రిజర్వాయర్ ఎగువ ప్రాంతమైన గోదావరి బేసిన్‌లో కురిసిన వర్షాలతో పాటు మహారాష్టల్రోని విష్ణుపురి, ఆమ్రేడ్ ప్రాజెక్టు జలాలు తోడు కావడంతో ప్రాజెక్టులోకి 13వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని ఎఇ మహేందర్ తెలిపారు. దీంతో కాకతీయ కాల్వ ద్వారా 4వేల క్యూసెక్కులు, సరస్వతి ద్వారా 100క్యూసెక్కులు, లక్ష్మి కాల్వ ద్వారా 50క్యూసెక్కులు, వరదకాల్వ ద్వారా 6000వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 10,200అవుట్ ఫ్లో ఉండగా, గురువారం సాయంత్రానికి రిజర్వాయర్ నీటిమట్టం 1077.80అడుగులు 46.28టిఎంసిలకు చేరుకుందన్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00అడుగులు 90టిఎంసిలు కాగా, గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1052.00అడుగులు 7.9టిఎంసిల వద్ద నీరు నిర్వ ఉన్నట్లు ఆయన తెలిపారు.
జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
ఇదిలా ఉండగా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన ప్రాజెక్టు అనుసంధానంతో నిర్మించిన జల విద్యుత్ కేంద్రంలో రెండు టర్బయిన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు జెన్‌కో ఎడి ఓఆర్ అండ్ ఎం సృతిమ తెలిపారు. కాకతీయ కాల్వ ద్వారా 4వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో రెండు టర్బయిన్ల ద్వారా 11.6మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, గడిచిన 24గంటల్లో 0.088మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని ఆమె తెలిపారు. కాకతీయ కాల్వ ద్వారా నీటి విడుదల పెంచితే మరో రెండు టర్బయిన్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని సృతిమ వెల్లడించారు.