నిజామాబాద్

ప్రిన్సిపాల్, వార్డెన్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 22: బాన్సువాడలోని ప్రభుత్వ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులకు మెనూ ప్రకారం ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, వార్డెన్‌లు తగిన మూల్యం చెల్లించుకున్నారు. వీరిరువురిని సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ యోగితారాణా గురువారం సాయంత్రం ప్రకటించారు. వీరితో పాటు నాసిరకమైన సరుకులను సరఫరా చేసిన గృహమిత్ర ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెడుతూ, సదరు నిర్వహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాకు చెందిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఉదయం బాన్సువాడ మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఆయన చేరుకున్న సమయంలో గురుకులం విద్యార్థినులు అల్పాహారం చేస్తుండగా, వారితో కలిసి మంత్రి పోచారం కూడా బాలికల కోసం తయారు చేసిన ఉప్మాను తిన్నారు. అది ఏమాత్రం రుచిగా లేకపోవడంతో స్టోర్ రూమ్‌ను తనిఖీ చేయగా, కాలం చెల్లిన నాసిరకం సరుకులు బయటపడ్డాయి. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అక్కడి నుండే కలెక్టర్‌కు ఫోన్ చేసి ఆహార పదార్థాలు, నిత్యవసర సరుకుల తనిఖీ కోసం ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఇతర అధికారులను పంపించి పరిశీలన జరిపించాలని సూచించారు. మంత్రి సూచనల మేరకు కలెక్టర్ అధికారుల బృందాన్ని గురుకులానికి పంపించి పరిశీలన జరిపించగా, నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేసినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో గురుకులం ప్రిన్సిపాల్ అసదుల్లా, వార్డెన్‌గా వ్యవహరిస్తున్న రేష్మాబేగంలను సస్పెండ్ చేస్తున్నట్టు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా నాసిరకమైన నిత్యవసర సరుకులను సరఫరా చేస్తున్న గృహమిత్ర ఏజెన్సీని బ్లాక్ లిస్టులో పెడుతూ, ఏజెన్సీ నిర్వహకులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
గృహమిత్ర ఏజెన్సీతో కుదుర్చుకున్న అన్ని ఒప్పందాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. వసతి గృహాలు, గురుకులాల్లో ఉంటున్న పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ యోగితారాణా ఈ సందర్భంగా హెచ్చరించారు. కాగా, జిల్లాలోని అన్ని గురుకులాలు, వసతి గృహాలు, అంగన్‌వాడి కేంద్రాలకు సరఫరా అవుతున్న నిత్యవసర వస్తువుల శాంపిళ్లను పరిశీలించేందుకు జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. డ్వామా విజిలెన్స్ అధికారి శ్రీహరి నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ సంక్షేమ శాఖల జిల్లా అధికారులు, ఐసిడిఎస్ పిడి, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఆర్డీఓలను ఈ కమిటీలో నియమించారు. ఈ కమిటీ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుందన్నారు. శాంపిల్స్‌కు అనుగుణంగా సరుకులు సరఫరా చేయని పక్షంలో వాటిని తిరస్కరించాల్సిన బాధ్యత గురుకులాల ప్రిన్సిపాళ్లు, హాస్టళ్ల వార్డెన్లదేనని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని విస్మరిస్తూ పొరపాట్లకు తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం సాయంత్రం జె.సి రవీందర్‌రెడ్డి వార్డెన్లు, ప్రిన్సిపాళ్లతో సమావేశమై పలు సూచనలు చేశారు.