నిజామాబాద్

సమస్యల పరిష్కారానికి చర్యలు : ఎమ్మెల్యే బిగాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, సెప్టెంబర్ 29: నిజామాబాద్ నగరంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పేర్కొన్నారు. గురువారం ఆయన నగరంలోని 49వ డివిజన్ పాములబస్తీలో పర్యటించి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గణేష్‌గుప్తా మాట్లాడుతూ, నగరంలో ఏళ్ల తరబడి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండటం వల్ల చిరుజల్లులకే రోడ్లన్నీ కాల్వలను తలపిస్తున్నాయని, శివారు ప్రాంతాల్లోనైతే ఇండ్లలోకి మురుగునీరు వచ్చి చేరుతున్న పరిస్థితి నెలకొందన్నారు. నగర ప్రజలకు ఇలాంటి దుస్థితి నుండి గట్టేక్కించేందుకు డ్రైనేజీలు, సిసి రోడ్ల నిర్మాణాలకు పెద్దమొత్తంలో నిధులు కేటాయిస్తూ పనులు చేపడుతున్నామని అన్నారు. అలాగే నగరంలో గత పాలకులు యుజిడి పనులను ప్రారంభించి అర్ధారంతరంగా వదిలేశారని, ప్రస్తుతం తెలంగాణ సర్కార్ వాటికి పెద్దఎత్తున నిధులు మంజూరీ చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో నగరంలో అస్తవ్యస్థంగా ఉన్న అండర్‌గ్రౌడ్ డ్రైనేజీ వ్యవస్థను మార్చేందుకు పటీష్టమైన చర్యలు చేపట్టామన్నారు. గత సంవత్సరం తాగు, సాగునీటి కోసం ప్రజలు పడరానిపాట్లు పడ్డారని, ఈసారి పుష్కలంగా వర్షాలు కురిసినందున వచ్చే రెండుమూడేళ్ల వరకు నీటి ఇక్కట్లు తీరినట్లేనని ఆయన పేర్కొన్నారు.