నిజామాబాద్

అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, అక్టోబర్ 22: రైతాంగానికి తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం సబ్సిడీపై కేటాయిస్తున్న ఎరువులు, విత్తనాల పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా హెచ్చరించారు. ఏదైనా సొసైటీలో ఎరువులు, విత్తనాలు దుర్వినియోగమైనట్టు తమ దృష్టికి వస్తే, వచ్చే ఏడాదికి సదరు సొసైటీకి వీటిని కేటాయించబోమని స్పష్టం చేశారు. శనివారం న్యూఅంబేద్కర్ భవన్‌లో సహకార సంఘాల కార్యదర్శులు, ఐకెపి సిబ్బందితో కలెక్టర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎరువులు, విత్తనాల విక్రయాల ద్వారా సొసైటీలకు ఆదాయం సమకూరుతుందని అన్నారు. అయితే బయట మార్కెట్ ధరతో పోలిస్తే, ప్రభుత్వం సబ్సిడీపై అందించే ఎరువులు, విత్తనాల ధరల్లో ఎంతో వ్యత్యాసం ఉన్నందున అక్రమాలకు ఆస్కారం లేకుండా ఎంతో నిజాయితీగా వీటిని పంపిణీ చేయాలని హితవు పలికారు. ఏ రోజున ఏ ప్రాంతంలో సబ్సిడీ విత్తనాలు అందజేయబడతాయనే వివరాలను ముందుగానే గ్రామ పంచాయతీ, ముఖ్యమైన కూడళ్ల వద్ద రాసి పెట్టాలని, టాంటాం ద్వారా రైతులకు తెలియజేయాలన్నారు. ఒక పంట వేసే రైతులకు 5ఎకరాల వరకు, రెండు పంటలు పండించే వారికి 8ఎకరాలకు సరిపడా సబ్సిడీ విత్తనాలు అందజేయాలని సూచించారు. జిల్లాకు 700క్వింటాళ్ల వరకు మినుము విత్తనాలు వస్తున్నాయని, ఎంత పరిమాణంలో స్టాక్ వచ్చిందనేది నిర్ధారించుకుని అందుకు అనుగుణంగా వాటి పంపిణీకి ప్రాంతాల వారీగా తేదీలను నిర్ణయించాలని అన్నారు. సొసైటీకి చెందిన రిజిస్టర్‌లో స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేయాలని, రైతులకు సంబంధించిన పట్టాదాస్ పాస్‌బుక్‌లలో ఉన్న వివరాలను పరిశీలిస్తూ, వారికి ఎన్ని ఎకరాల భూమి ఉంటే అంతే మొత్తంలో విత్తనాలు అందజేయాలని, పంపిణీ అనంతరం రబ్బర్ స్టాంప్ ముద్ర వేయాలని ఆదేశించారు. రైతుల డిమాండ్ మేరకే విత్తనాలు, ఎరువులను తెప్పించుకోవాలని, ఒకవేళ ఎక్కడైనా మిగిలిపోతే వాటిని సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులే తమ సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. విత్తనాలను ఎవరెవరికి పంపిణీ చేశారనే పూర్తి వివరాలను రైతుల వారీగా రిజిస్టర్‌లో పొందుపర్చాలని, రైతులకు సంబంధించిన పట్టాదార్ పాస్‌బుక్కుల్లోనూ నమోదు చేయాలన్నారు. వారం రోజుల అనంతరం తాము ఈ వివరాలను క్రాస్ చెక్ చేస్తామని చెప్పారు. ఏమాత్రం అలసత్వానికి తావులేకుండా సబ్సిడీపై అందిస్తున్న ఎరువులు, విత్తనాలు దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. జాయింట్ కలెక్టర్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ, సొసైటీలకు విత్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. వాస్తవంగానే పంటలను సాగు చేసే అర్హులైన రైతులకే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు.