నిజామాబాద్

మళ్లీ ‘హవాలా’ దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, డిసెంబర్ 3: కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం హవాలా దందాకు మళ్లీ ప్రాణం పోసినట్లయ్యింది. నల్లధనం, నకిలీ కరెన్సీని నిరోధించేందుకు చేపట్టిన చర్యలు ఎంతవరకు సత్ఫలితాలు అందిస్తాయో కానీ, అంతరించిపోయిందనుకున్న హుండీ వ్యాపారాన్ని తిరిగి తెరపైకి తెచ్చిందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అభివృద్ధి చెందని కారణంగా గత దశాబ్దన్నర కాలం క్రితం వరకు కూడా నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున హుండీ వ్యాపారం కొనసాగేది. ఉత్తర తెలంగాణ జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌ల నుండి గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. దీంతో ఉపాధి కోసం ఎడారి దేశాలకు తరలివెళ్లిన వారంతా స్వస్థలాల్లోని తమ కుటుంబీకులకు డబ్బులు పంపేందుకు హుండీ మార్గానే్న ఎంచుకునేవారు. గల్ఫ్‌లో ఉండే హుండీ వ్యాపారులకు సొమ్ము అందజేస్తే, వారు కమీషన్‌ను మినహాయించుకుని స్థానికంగా ఉండే ఏజెంట్ల ద్వారా అనధికారికంగా సంబంధిత కుటుంబాల వారికి చేరవేసేవారు. ప్రతిరోజు కోట్లాది రూపాయల డబ్బులు ఈ అక్రమ పద్ధతిలో చేతులు మారేవి. పోలీసులకు పక్కా సమాచారం అంది దాడులు చేసిన సందర్భాల్లో పెద్ద మొత్తంలో నగదు లభ్యమయ్యేది. అయితే విదేశాల నుండి డబ్బులు పంపించేందుకు ప్రభుత్వం సరళీకృత విధానాలతో కొత్త మార్గదర్శకాలను జారీ చేయడంతో వెస్ట్రన్ మనీ యూనియన్, మనీ ఎక్స్‌చేంజ్ బ్రాంచ్‌లు ఇబ్బడిముబ్బడిగా వెలిశాయి. దీంతో విదేశాల్లో ఉంటున్న వారు కూడా అధికారికంగానే పై పద్ధతుల్లో డబ్బులు పంపించడానికి అలవాటుపడడంతో గడిచిన దశాబ్ద కాలం నుండి హుండీ వ్యాపారం తెరమరుగైంది. ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని మళ్లీ పురుడుపోసుకోవడం ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. కరెన్సీ కొరత కారణంగా యుఎఇలు, వెస్ట్రర్న్ మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రాలు దాదాపుగా మూతబడ్డాయి. గల్ఫ్‌లో ఉంటున్న వారు సొమ్ము పంపినప్పటికీ, పెద్ద నోట్ల రద్దుతో వారి కుటుంబ సభ్యులకు ఆ మొత్తాన్ని అందించే వెసులుబాటు లేకుండాపోయింది. బ్యాంకుల నుండి పరిమితంగానే నగదును విత్‌డ్రా చేయాలనే ఆంక్షలు అమల్లో ఉండడంతో పాటు అన్నింటికి మించి అవసరానికి సరిపడా నగదు మొత్తాన్ని అందించేలా ఏ ఒక్క బ్యాంకులోనూ పూర్తిస్థాయిలో కరెన్సీ లేకపోవడంతో అధికారిక పద్ధతుల్లో విదేశీ మారకం మార్పిడి వ్యాపారం సాగిస్తున్న సంస్థల నిర్వహణ భారంగా మారింది. అదే సమయంలో హుండీ వ్యాపారులు, ఏజెంట్లు మాత్రం ఈ అవకాశాన్ని అనుకూలంగా మల్చుకుని సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగినట్టు స్పష్టమవుతోంది. గల్ఫ్‌కు వెళ్లిన వారి సంఖ్య అత్యధికంగా ఉన్న నిజామాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుని హవాలా దందాను పెద్దఎత్తున కొనసాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ తదితర మహా నగరాల నుండి అడ్డదారుల్లో కొత్త కరెన్సీని చేజిక్కించుకుని హుండీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గల్ఫ్ బాధిత కుటుంబాల వారు గత్యంతరం లేని పరిస్థితుల్లో హవాలా ఏజెంట్లను సంప్రదిస్తూ వారి ద్వారానే తమ అవసరాలకు సరిపడా డబ్బులను తీసుకోవాల్సి వస్తోంది. ఇదే అదనుగా భావిస్తూ ఇదివరకటి కంటే ఎక్కువ మొత్తంలో కమీషన్‌ను వసూలు చేస్తూ హుండీ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మొదటి నుండీ ఈ దందాకు నిజామాబాద్ జిల్లా కేంద్ర బిందువుగా నిలుస్తుండడంతో, ఇదివరకటి హుండీ వ్యాపారులు, ఏజెంట్ల గురించి తెలిసిన వారంతా ప్రస్తుతం వారినే ఆశ్రయిస్తూ విదేశాల్లో తమ వారు పంపే నగదును అందించేలా చూడాలని కోరుతున్నారు. మళ్లీ పురుడుపోసుకున్న ఈ దందాపై పోలీసులు దృష్టిని కేంద్రీకరించకపోతే హుండీ వ్యాపారం వేళ్లూనుకునే ప్రమాదం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు.

లోకకల్యాణార్థమే చండీయాగం
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
నిజాంసాగర్, డిసెంబర్ 3: లోక కళ్యాణార్థమే శ్రీరుద్ర హవన పురస్సర శతచండీయాగం నిర్వహించడం జరుగుతోందని, రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖామాత్యులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలోనిర్వహిస్తున్న శతచండీయాగానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈసందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీ చైర్మైన్ దఫేదార్‌రాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేలకు పురోహితులు పూర్ణకుంభం, నాదస్వర వాయిద్యంతోఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి భక్తులనుద్దేశించి మాట్లాడారు. గ్రామంలోశతచండీయాగం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. యాగం నిబద్దత, భక్తిశ్రద్దలతోనిర్వహించాల్సి ఉంటుందని,ప్రజలందరు యాగానికి భక్తిప్రపత్తులతోహాజరు కావాలని కోరారు. రాజుల కాలంలోవర్షాలు కురవకుంటే వరణ యాగం చేసేవారని, యాగంతోవర్షాలు సంమృద్దిగా కురిసేవన్నారు. గతంలోయాగం చేసే చోటే వర్షాలు కురుస్తాయని, పెద్దలు చెప్పెవారన్నారు. గోర్గల్ గ్రామంలోయాగం చేయడం వల్ల ఆకాశంలోమబ్బులు కమ్మాయన్నారు. ఆడబిడ్డలు చేసే ప్రతి పని విజయవంతం కావాలని, ప్రజలంతా చల్లంగా ఉండాలని భగవంతున్ని వేడుకున్నారు. అనంతరం మంత్రికి సిడిసి చైర్మైన్ దుర్గరెడ్డి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు.

ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలి
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
భిక్కనూరు, డిసెంబర్ 3: రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం 245 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసిన తమ ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం మరో 210 గురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఉన్నత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. శనివారం ఆయన మండలంలోని జంగంపల్లి వద్ద ఉన్న కస్తూర్భాగాంధీ పాఠశాల విద్యార్థినిలకు దుప్పట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బిటిఎస్ చౌరస్తాలో ఉన్న తెలంగాణ సౌత్ క్యాంపస్‌కు వెళ్లి 13కోట్ల రూపాయలతో నిర్మించిన బాలికల, బాలుర వసతి గృహాల భవన సముదాయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని ఏ ప్రభుత్వం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించలేదన్నారు. కాని సిఎం కెసిఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేయాలనే ఉద్దేశంతో విద్యా ప్రమాణాలను మెరుగుపర్చుతుందన్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యావ్యవస్థ పూర్తిగా భ్రస్టు పట్టిందని విమర్శించారు. కాని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికతో ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్రంలో మొత్తం 11యూనివర్సిటీలు ఉండగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదన్నారు. మంచి ఫలితాలు సాధించడం కోసం సౌత్ క్యాంపస్‌ను అభివృద్ధి పర్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. గత విసిగా పనిచేసిన పార్థసారధి సారథ్యంలో సౌత్ క్యాంపస్ ఎంతో అభివృద్ధి చెందిందని, నూతన అకాడమిక్ భవన నిర్మాణం కోసం ప్రణాళికలు తయారు చేయాలని విసిని ఆదేశించారు. మానవ వనరుల అభివృద్ధితో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు.
అవకాశం వచ్చినప్పుడు ఫలితాలు చూపించి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాల్సిన బాధ్యత అధ్యాపకులపై ఉందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థుల కోసం అవసరమైన భవన నిర్మాణాల కోసం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అనంతరం జంగంపల్లి కస్తూర్భాగాంధీ పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ పరిశుభ్రత పాటించకపోవడం పట్ల స్థానిక సిబ్బందిపై మంత్రి ఆగ్రహాం వ్యక్తం చేశారు.

బ్యాంకుల్లో తగ్గని రద్దీ
అంతంత మాత్రంగానే కేటాయింపులతో వినియోగదారుల విచారం
మోర్తాడ్, డిసెంబర్ 3: బ్యాంకులకు సరిపడా నగదులు నిల్వలు రాకపోవడంతో వినియోగదారులకు ఆశించిన స్థాయిలో డబ్బు అందడం లేదు. శనివారం కూడా మోర్తాడ్ ఎస్‌బిహెచ్ కార్యాలయానికి భారీగా వినియోగదారులు తరలివచ్చారు. బ్యాంకు గేట్లు తెరువకముందే అక్కడికి చేరుకున్న వినియోగదారులంతా సిబ్బంది రాగానే కౌంటర్ల వద్దకు పరుగులు తీశారు. బ్యాంకులోనూ పూర్తిస్థాయిలో సిబ్బంది లేకపోవడంతో ఉన్న సిబ్బందియే వినియోగదారులకు సేవలందించేందుకు ప్రయత్నించారు. వాస్తవానికి ఒక్కో వినియోగదారుడికి వారానికి 24వేల రూపాయల వంతున చెల్లించవచ్చని, రోజుకు 4వేల వంతున ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, స్థానికంగా మాత్రం ఆ పరిస్థితులు కనిపించడం లేదు.
ఆర్మూర్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్, భీమ్‌గల్ ప్రధాన బ్యాంకులు కాగా, వీటి ద్వారా డివిజన్ పరిధిలోని అన్ని బ్యాంకులకు రోజువారిగా నగదును విడుదల చేస్తారు. వినియోగదారుల సంఖ్యను బట్టి డబ్బులు కేటాయించాల్సి ఉండగా, ఒక్కో బ్యాంకుకు రెండు లక్షల రూపాయలు మాత్రమే పంపిణీ చేస్తుండటంతో గంటల తరబడి బారులు తీరిన వినియోగదారులకు డబ్బులు అందని పరిస్థితి. దీంతో గరిష్ఠంగా ఒక్కో వినియోగదారుడికి 2000రూపాయలు మాత్రమే బ్యాంకు అధికారులు చెల్లిస్తున్నారు. నాలుగు రోజులుగా ఏటిఎంలలో కూడా నగదు పెట్టకపోవడంతో అక్కడికి చేరుకున్న వినియోగదారులంతా నిరుత్సాహంగా వెనుదిరుగుతున్నారు. అసలే నెలలో మొదటి వారం కావడంతో చెల్లింపులు భారీగా ఉంటాయని, డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని క్యూలో నిలబడిన మహిళలు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 10వేల రూపాయల నగదు చెల్లిస్తామని సర్కార్ ప్రకటించినప్పటికీ, ఆ పరిస్థితి గ్రామీణ బ్యాంకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదు. కాగా, శనివారం బ్యాంకు అధికారులు వినియోగదారులకు గరిష్ఠంగా 5వేల రూపాయలు చెల్లించేందుకు అంగీకరించారు. ఇందులో కూడా అత్యధికంగా 2000రూపాయల నోట్లే ఉండటంతో చిల్లర లభించక నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. నిన్నటి వరకు పెట్రోల్ బంకుల్లోనూ, పోస్ట్ఫాసుల్లోనూ డబ్బులు తీసుకున్న సందర్భాలు శనివారం కనిపించకపోవడంతో పెట్రోల్ బంకుల్లో చాలామంది వినియోగదారులు వెనుదిరిగి వెళ్లారు. అసలే రేపు ఆదివారం కావడంతో బ్యాంకులు మూసి ఉంటాయని, ఎటిఎంలలో డబ్బులు ఉండవని, ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు లభించక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు.
ఇప్పటికైనా బ్యాంకు జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించి, గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంకులకు అధిక మొత్తంలో నగదు విడుదల చేయాలని వారు కోరుతున్నారు.

పట్టుదల ఉంటే అంగవైకల్యం అడ్డుకాదు
కలెక్టర్ యోగితా రాణా
ఇందూర్, డిసెంబర్ 3: కృషి, పట్టుదలకు తోడు తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు ఉన్నప్పుడు విజయాలు సాధించేందుకు అంగవైకల్యం అడ్డుకాదని కలెక్టర్ డాక్టర్ యోగితారాణా పేర్కొన్నారు. శనివారం స్థానిక రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించగా, కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూత అందిస్తోందన్నారు. తల్లిదండ్రులు దివ్యాంగ పిల్లలను 100శాతం పాఠశాలలకు పంపించాలని కోరారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వం భవిత కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఎన్‌జివోలు, సొసైటీలు సైతం దివ్యాంగుల కోసం పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని, అందువల్ల ప్రతి దివ్యాంగ విద్యార్థిని అందులో చేర్పించేందుకు తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. స్వతగా ఎదిగేందుకు అంగవైకల్యం అడ్డురాదని, దివ్యాంగులకు చేయూత అందిస్తే సివిల్ సర్వీసుల్లో సైతం ప్రతిభను చాటిన వారు ఉన్నారని కలెక్టర్ గుర్తు చేశారు. దివ్యాంగులకు జిల్లాలో 50లక్షల వ్యయంతో ఆర్టికల్స్ ల్యాబ్ తయాలు చేయించడం జరిగిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న 16వేల మందికి పెన్షన్లు అందజేయడం జరుగుతుందని, వాహనం కొనుగోలుకు సైతం రుణాలు అందజేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. వికలాంగులకు చేయూతను అందిస్తున్న రోటరీ క్లబ్ వారిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించారు.

సదరం సర్ట్ఫికేట్ లేని వారు సోమవారం ప్రజావాణికి వస్తే, 40శాతం కంటే ఎక్కువ ఉంటే ప్రజావాణిలో డాక్టర్ ద్వారా పరీక్ష చేయించి, సదరం సర్ట్ఫికేట్ అందజేస్తామన్నారు. వికలాంగులు ఇజిఎస్‌లో 70శాతం పనులు చేస్తే, మరో 30శాతం కలిపి 100శాతం డబ్బులు చెల్లించడం జరుగుతుందన్నారు. వీరి గ్రూప్‌లకు సులభమైన పనులనే కల్పించడం జరుగుతుందని, ప్రతి జిపిలో ఫీల్డ్‌అసిస్టెంట్ వీరికి తప్పని సరిగా పని కల్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

గిట్టుబాటు ధర కల్పించాలి
కంఠేశ్వర్, డిసెంబర్ 3: రైతులు పండించిన సన్నరకాల వడ్లకు ప్రభుత్వం క్వింటాలుకు 1800రూపాయల గిట్టుబాటు ధర చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఉత్పత్తులను రైతులు మార్కెట్‌కు తీసుకవస్తే, వ్యాపారులు, ప్రభుత్వం కుమ్మక్కై సన్నరకం వడ్లను క్వింటాలుకు 1600నుండి 1700రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి 1800రూపాయల గిట్టుబాటు ధర చెల్లిస్తామని ప్రకటించి, రైస్‌మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తామని ఇచ్చిన హామీ ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదన్నారు. రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, రైస్‌మిల్లర్లు మాత్రం 1600నుండి 1700రూపాయలకు మించి ధర చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సన్నరకం వడ్లకు క్వింటాళుకు 1800రూపాయలు చెల్లిస్తూ, కొనుగోళ్లు ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు దొడ్డురకం ధాన్యానికి క్వింటాళుకు 2250రూపాయలు, సన్నరకానికి 2500రూపాయల మద్దతు ధర చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో సిపిఐ నాయకులు సుధాకర్, రాజన్న, ముత్యాలు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

అంతా మీ ఇష్టమేనా...
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్
కంఠేశ్వర్, డిసెంబర్ 3: మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేయడం, ధాన్యం కొనుగోళ్లు బంద్ చేసి సమ్మెకు దిగడం సరైన పద్దతా, అంతా మీ ఇష్టమేనా అంటూ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి, కమిషన్ ఏజెంట్లను ప్రశ్నించారు. శనివారం జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో కమిషన్ ఏజెంట్లతో, కొనుగోలుదారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మిబాయి మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రైతులు రాకుండా కమీషన్ ఏజెంట్లు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమన్నారు. కొనుగోళ్లు ప్రారంభించి, నిలివేయించడం ప్రభుత్వ హక్కు అని, కమీషన్ ఏజెంట్లకు ఆ హక్కు లేదని ఆమె స్పష్టం చేశారు. కమీషన్ ఏజెంట్లు ఇష్టమోచ్చినట్లు వ్యవహరిస్తే కోర్టులో కేసులు వేస్తామని, అప్పుడు నష్టపోయేది ఏజెంట్లేనని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికైనా సమ్మెను విరమించుకుని, రైతులు మార్కెట్‌కు తీసుకవచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. దీంతో దిగివచ్చిన కమీషన్ ఏజెంట్లు సమ్మెకు దిగినందుకు తమను క్షమించాలని, మార్కెట్ యార్డులో కొనుగోళ్లకు తమకు అనుమతులు ఇవ్వాలంటూ వేడుకున్నారు. ఇందుకు ఆమె అంగీకరించడంతో సోమవారం నుండి కొనుగోళ్లను ప్రారంభిస్తామని కమీషన్ ఏజెంట్లు లక్ష్మిబాయికి హామీ ఇచ్చారు.

పేదల సంక్షేమమే ధ్యేయం
డిచ్‌పల్లి, డిసెంబర్ 3: పేద ప్రజల సంక్షేమం దిశగా తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందని నిజామాబాద్ రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. శనివారం ఆయన దర్పల్లి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి, సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధిదారులకు మంజూరైన 51వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేద ప్రజల సంక్షేమం కోసం టిఆర్‌ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం ఎన్నో సంక్షమ పథకాలను అమలు చేస్తోందన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో లక్ష్యానికి మించి అభివృద్ధి సాధించామని, తాగు, సాగునీటి పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన వివరించారు.