నిజామాబాద్

యోగతో చెడు వ్యసనాలు దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, డిసెంబర్ 11: ప్రజల ఆరోగ్యం బాగుడాలంటే ప్రతి ఒక్కరు యోగ చేయాలని అప్పుడే చెడు వ్యసనాలు దూరం అవుతాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో రాష్టస్థ్రాయి యోగ ముగింపు పోటీలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యానికి ఉపయోగపడే ఆయుధం యోగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు యోగ చేసినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని అప్పుడు గ్రామాలతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. రోజు ఉదయం గంట పాటు యోగ చేస్తానని తమ యొక్క గురువు రాంచంద్రం యోగ విద్యను రోజు అందిస్తారన్నారు. 73సంవత్సరాల వయస్సులో కూడా ప్రతిరోజు అన్ని ప్రభుత్వ, ప్రైవెట్ కార్యక్రమాల్లో చరుకుగా పాల్గొనడానికి యోగనే కారణమని పేర్కొన్నారు. యోగ చేసిన వారికి రక్తప్రసరణ బాగుటుందన్నారు. శరీర అవయవాలు చక్కగా పనిచేస్తాయన్నారు. ప్రతి పాఠశాలలో కూడా యోగ ప్రవేశపెట్టడానికి కృషి చేస్తామన్నారు. ప్రతిరోజు అన్ని రంగాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ప్రశాంతంగా ఉండాలంటే యోగ చేయాలన్నారు. యోగ వల్ల షుగర్, బిపి, క్యాన్సర్ దూరమవుతాయన్నారు. చిన్నప్పటి నుండి యోగ చేస్తే ఆరోగ్యంగా ఉంటూ రోగాలు దరిచేరవన్నారు. యోగను ప్రతి ఒక్కరు ఆదరించాలన్నారు. యోగను అభివృద్ధి చేయడానికి సిఎం దృష్టికి తీసుకువెళ్తానన్నారు.
యోగ ద్వారానే ఆరోగ్యం : ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్
యోగ చేసిన వారు ఆరోగ్యంగా ఉంటారని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్టస్థ్రాయి యోగ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వందలాది మంది యోగ అభిమానులు పాల్గొని తమ విన్యాసాలు ప్రదర్శించడం గొప్ప విషయమన్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు లక్షలాది రూపాయలు ఆసుపత్రికి చెల్లించే బదులు యోగ చేస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా యోగను ప్రవేశపెడితే బాగుంటుందన్నారు. అనంతరం వివిధ జిల్లాలకు చెందిన నిఖిత, మంజుల, అహల్య, శ్రీజ, సుష్మ, వైష్ణవి, మరో 30మందికి బహుమతులను హోంమంత్రితో పాటు ప్రభుత్వ విప్‌లు అందించారు. అనంతరం హోంమంత్రి, ప్రభుత్వ విప్‌లను స్థానిక ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు రాంచంద్రం, అంజయ్య, రాంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుష్మ, జడ్పిటిసి సభ్యులు నంద రమేశ్, లక్ష్మీ, మదుసుధన్‌రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గౌరి శంకర్, ఆత్మ కమిటీ చైర్మన్ బల్వంత్‌రావు, కౌన్సిలర్లు మాసుల లక్ష్మీనారాయణ, నాయకులు పొన్నాల లక్ష్మారెడ్డి, లక్ష్మీపతీయాదవ్, గెరిగంటి లక్ష్మీనారాయణ, భూమేశ్‌యాదవ్, డిఇఓ మదన్‌మోహన్, కాంశెట్టి, తదితరులు పాల్గొన్నారు.