నేర్చుకుందాం

మైకంలో ఉన్నా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైకంలో ఉన్నాను.. మైమరచి ఉన్నాను
మోహంలో ఉన్నాను.. వౌనంగా ఉన్నాను
కళ్లప్పగించి కనికట్టు చూస్తున్నాను.

ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక!
అంటూ ఓ పిచ్చోడి పొలికేక.
ఇంద్రియాలను లగ్నం చేసి ఇంద్రజాలం చూస్తున్నప్పుడు,
ఎవడీ పానకంలో పుడక
బహుశా ప్రమోద హెచ్చరిక కావొచ్చు.
కాదా మరి.
ఎంత గొప్ప ఇంద్రజాలం!
క్షణానికో స్వర్గం, ఘడియకో స్వప్నం
రోజుకో ఉత్సవం, పూటకో సంబరం
ఎంత ఘటికుడీ మాంత్రికుడు
అద్దం చూడమన్నాడు. ఆశ్చర్యం
నా అర్ధ దిగంబర వేషం, అందులో
పట్టుపీతాంబర ప్రతిబింబం.
వీధి చూపించాడు
పులులన్నీ గోవేషాలేస్తున్నాయి
ఆవేశాలొస్తున్నాయి
తోకలు తోక తొక్కిన త్రాచులవ్వగా,
పన్నాగ స్వరాలు మిన్నంటగా
ఊరు చూపించాడు.
ఉన్న పళంగా బురద పొలం మాయమైంది
ఊరంతా బంగరు ఉరికొయ్యలు మొలిచాయి
సమాధులపై సౌధాలు మెరిశాయి
వాడ చూపించాడు.
వాడ గోడల నిండా వాడి బోధనలే
వేదనలే కానరాని స్వర్గ శోధనలే.

మళ్లీ వినిపించింది. రెండో నెంబర్
ప్రమాద హెచ్చరిక
పళ్లు కొరుకుతూ కళ్లు తెరిచాను
నా ఒళ్లు చూసుకొని తుళ్లిపడ్డాను
ఎందుకంటే, ప్రేక్షకుల్లో నేను లేను
చెవుల పిల్లిగా మారాను.. వాడి చేతిలో ఉన్నాను
గట్టిగా ఇప్పుడు నేను అరుస్తున్నాను
ప్రమాదం.. ప్రమాదం
పట్టించుకుంటారా ఎవరైనా? ఏమో!
*

-డా.డి.వి.జి.శంకరరావు 9440836931