మెయిన్ ఫీచర్

సాక్షాత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏ తన్నామ్నే స్వస్తి భవంతో బ్రువంతి’’ అని శాస్త్ర శుభదృష్టి కోసం
దేవతలను, మాసాలను, నక్షత్రాలను నా పేర్లుగా నిర్దేశించి,
నాకో సార్థక నామం పెట్టి ప్రస్ఫుటపరచావు!
నాకంటూ గుర్తింపునిచ్చావు!! ‘‘పసివాడంటే భగవంతుడే’’ అంటూ నాలుగు వేదాల త్రాళ్లతో,
బ్రహ్మాండమనే ఊయలలో విశ్వస్వరూపుడే నా ఈ చిగురుల మెత్త అంటూ,
పవళింపజేసి, పరవసించిపోతూ,
‘‘జో అచ్యుతానంద! జోజో ముకుంద’’ అని లాలి పాటలతో నిద్రబుచ్చావు
నీ కంఠ స్వరాన్ని నా చిన్ని జ్ఞాపకాల పొరల్లో
నిక్షిప్తం చేసుకుని, నీ గొంతునే వింటూ నా మనసు ఊరడింపు పొందింది.
నిజం తల్లీ! నా అణువణువు అమ్మే సాక్షాత్కరించింది.

-బి.యస్.నారాయణ దుర్గ్భాట్టు 9346911199