ఆరోగ్య భాగ్యం

శరీరంలో మార్పు వస్తోందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలామంది స్ర్తిలకు నెలసరి బయటలు సరిగా రావు. అంటే కచ్చితంగా అదే తారీకున రాకపోయినా 3, 4 రోజులు అటూ ఇటూగా రావడం సహజమైన పరిస్థితి. కాని వారం రోజులు ముందుగానో వారం ఆపై ఇంకా ఎక్కువ రోజులు లేక వారాలు ఆలస్యంగా వచ్చినపుడు శరీరంలో ఏదో మార్పు వచ్చినట్టు గుర్తించాలి.
ఓవరీలు స్ర్తి శరీరంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే ముఖ్యమైన హార్మోన్లు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ ఏండ్రోజను వంటివి అపసవ్యమైన నిష్పత్తిలో వుండడంతో అండాశయం నించి అండం విడుదల కాదు. అన్ని అండాలు కొద్ది కొద్దిగా పెరిగి సగంలో నిలిచిపోతాయి. ఇవే కొన్ని నీటి బుడగలుగా మారి అండోత్పత్తి ఆగిపోతుంది.
అండం విడుదలైతే గాని ప్రొజెస్టిరాన్ ఉండదు. నెలసరి కూడా వుండదు. ఇలా రెండు మూడు నెలలు ఆలస్యంగా పీరియడ్సు రావచ్చు. ఈ సూచనతో పిసిఓడి ఉందేమోనని ఆ దిశగా పరీక్షలు చేయించాలి. అన్నింటికంటే ముఖ్యమైనది- రక్తపరీక్ష, రక్తహీనతవల్ల కూడా పీరియడ్సు ఆలస్యంగా రావచ్చు. తర్వాత అల్ట్రాసౌండ్ స్కానింగు పరీక్ష. ఇందులో ఓవరీలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. ఓవరీలో 5-10 వరకు నీటిబుడగలు కనిపించి, ఓవరీ పరిమాణం కూడా పెరిగి వున్న పక్షంలో పిసిఓడి నిర్థారణ అయినట్టే. గైనకాలజిస్టు సలహాతో ప్రతీ స్ర్తికి ఒక తరహా చికిత్స చేయించాలి.
కొంతమందికి ఊబకాయం తగ్గించి, తగుపాటి వ్యాయామం చేయిస్తే ఫలితం వుంటుంది. కొందరికి కొన్ని మందుల ద్వారా ఓవరీలలోని నీటి బుడగల్ని నివారించవచ్చు. ఈ మందులే ఓవ్యులేషన్ ఇండ్యూసింగ్ డ్రగ్స్ అంటారు. ప్రతినెలా డాక్టరు సలహాతో నెల వచ్చిన 5వ రోజునుంచి ఐదు బిళ్లలు రోజూ ఒకటి చొప్పున 4, 5 నెలలు వాడితే నీటి బుడగలు పోయి అండం బయటికి రాగల్గుతుంది. ప్రతీ నెలా ఇలా అండం వస్తూంటే ఫలదీకరణకు అవకాశం వుంటుంది. వివాహితులకు గర్భం నిలిచే వీలుంటుంది.
పెళ్లికానివారికికూడా ప్రతినెలా క్రమం తప్పకుండా ఓవ్యులేషన్ అయితే వారికి నెలసరి క్రమం తప్పకుండా వస్తుంది.
అయితే ఈ పిసిఓడివల్ల నష్టమేమిటి? పీరియడ్సు సరిగా రాకపోతే ఏవౌతుంది? అని సందేహం రావచ్చు. ఒకటి పీరియడ్సు అనుకున్న సమయానికి రాకపోతే స్ర్తిలకు ఇబ్బంది- ముఖ్యంగా ఉద్యోగినులకు. చదువుకునే పిల్లలకి అకస్మాత్తుగా స్కూలులోనో ఎక్కడో మొదలైతే చాలా బాధాకరం, ఇబ్బంది.
ఇంకొకటి వివాహితులకు సంతాన ప్రాప్తి వుండదు. చికిత్స లేని వారిలో ఎక్కువ రక్తస్రావం అవడం, చాలా రక్తహీనత ఏర్పడటం సర్వసాధారణం. వీరిలో కొందరికి వృద్ధాప్యంలో గర్భసంచి క్యాన్సరు రావచ్చు. కనుక మొదట్లోనే డాక్టరు పరీక్షలతో చికిత్స చేయించాలి.
అందరికీ నోటిమందులతో పిసిఓడి తగ్గిపోదు. కొందరికి ఇంజెక్షన్లు అవసరం పడవచ్చు. మరికొందరికి ముదిరిన పరిస్థితిలో లాపరోస్కోపీ అనే అధునాతన వైద్య విధానంతో నీటిబుడగల్ని చిదిపివేయవచ్చు. దానికి సూదులతో గుచ్చి గాని, ఎలక్ట్రిక్ కాటరీగాని పెట్టి తగ్గించవచ్చు. దీనిలో నిష్ణాతులైన గైనకాలజిస్టులతోనే చేయించుకోవాలి. చాలామందికి తర్వాత వెంటనే పీరియడ్సు రావడం, త్వరలోనే గర్భం నిలవడం చూస్తూ వుంటాము. లాపరోస్కపీవల్ల ఇంకొక లాభమేమంటే మరేవైనా పరిస్థితులు- ఉదా: ఎండోమెట్రియోసిస్ లేక ట్యూమర్లు గాని వుంటే వాటిని కూడా తొలగించవచ్చు. ట్యూబులు సరిగా ఉన్నాయో లేదోనని చూడవచ్చు.

--డా. కేతరాజు సరోజినీ దేవి, ఎం.డి, డిజివో